శ్రీవారి సేవలో ప్రవీణ్ తొగాడియా | Praveen togadiya In suprabhata service | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ప్రవీణ్ తొగాడియా

Published Sun, Mar 20 2016 7:59 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

Praveen togadiya In suprabhata service

విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున 3గంటలకు సుప్రభాతసేవలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు జి.భానుప్రకాష్‌రెడ్డి ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లుచేసి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

శ్రీవారికి రెండు బంగారు శంఖుల కానుక
 కాగా..  తిరుమల శ్రీవారి అభిషేక సేవలో వినియోగించేందుకు ఆదివారం రెండు బంగారు శంఖులు కానుకగా అందాయి. సుమారు రూ.50 లక్షల విలువైన ఈ శంఖులను టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావుకు అజ్ఞాత భక్తులు అందజేశారు. వీటిని ప్రతి శుక్రవారం స్వామివారికి నిర్వహించే అభిషేక సేవలో వినియోగిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement