
నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిషన్ అయిన హరిచరణ్
అనంతపురం న్యూసిటీ: హోంవర్క్ చేయలేదని ఓ విద్యార్థిని ప్రైవేట్ టీచర్ చితకబాదిన ఘటన గురువారం సాయంత్రం అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సాయినగర్‌లోని కేశవరెడ్డి స్కూల్‌లో హరిచరణ్ నాల్గో తరగతి చదువుతున్నాడు. హోంవర్క్ చేయలేదని టీచర్ జిగిని హరిచరణ్‌పై చేయి చేసుకుంది. ఈ క్రమంలో హరిచరణ్ చేతిలో పెన్సిల్ ఉంది. కిందకు పడ్డ విద్యార్థి చేతిలోకి పెన్సిల్ దూసుకెళ్లింది. దీంతో పెన్సిల్ ముక్కలు చేతిలోకి వెళ్లాయి. తీవ్ర రక్తస్రావంతో విద్యార్థి విలవిల్లాడిపోయాడు. పాఠశాల నిర్వాహకులు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు సర్జరీ చేసి పెన్సిల్ ముక్కలను తొల గించారు. శుక్రవారం ఉదయం విద్యార్థి కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత టీచర్ జిగినిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విధుల నుంచి టీచరు తొలిగింపు
విద్యార్థి హరిచరణ్‌ను చితకబాదిన ఘటనపై విచారణ చేపట్టేందుకు అనంతపురం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి దేవరాజు శుక్రవారం కేశవరెడ్డి స్కూలుకు వెళ్లారు. డిప్యూటీ డీఈఓ ఆదేశాల మేరకు టీచరు జిగినిని విధుల నుంచి తప్పిస్తూ యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై స్కూల్‌కు ఉప విద్యాశాఖ అధికారి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment