
సింగపూర్ బృందానికి తిరుమలలో డ్రెస్ కోడ్ ఇబ్బందులు
తిరుమల: ముఖ్యమంత్రి వెంట మంగళవారం తిరుమలకు వచ్చిన సింగపూర్ బృందానికి డ్రెస్ కోడ్‌తో ఇబ్బందులు వచ్చాయి. తిరుమల శ్రీవారిని దర్శించడానికి తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులనే ధరించాలి. ఈ బృందంలో పురుషులు పంచె, చొక్కా, మహిళలు చీరతోనూ, చుడీదార్‌లతోనూ వచ్చారు.
అయితే, పురుషులు కొందరు పంచెలు ధరించేందుకు నానా తంటాలు పడ్డారు. టీటీడీ ఈవో, జేఈవో ముందస్తు చర్యలు తీసుకుని వారికి పంచె ధరించడంపై అవగాహన కల్పించారు. ఇందుకు ఏఈవో స్థాయి అధికారులను నియమించారు. దీంతో వారు పంచెలు ధరించి దర్శనానికి వచ్చారు. సీఎం వెంట వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ప్యాంటు మీద పంచె చుట్టుకుని వచ్చారు.