తిరుమల : సింగపూర్ మంత్రి కె.షన్ముగం శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో పండితుల ఆశీర్వచనాల మధ్య ఆలయ అధికారులు ఆయనను పట్టువస్త్రంతో సత్కరించారు. లడ్డూ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన మీడియాకు వెల్లడించారు.