ఆస్తిపన్నుకు ‘ఈ’ మార్గం
Published Wed, Dec 4 2013 3:06 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM
సాక్షి, రాజమండ్రి : మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఆస్తిపన్ను చెల్లింపును పురపాలక శాఖ మరింత సులభతరం చేసింది. ఈ నెల నుంచి ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించే వీలు కల్పించింది. ఇందుకోసం ఈ సువిధరూ. పోర్టల్‌ను రూపొందించింది. దీని ద్వారా చెల్లింపులు చేయడం వల్ల గంటల తరబడి క్యూలో వేచి ఉండే బాధ ప్రజలకు తప్పనుంది. అలాగే సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లించే వీలు కలుగుతుంది.
ఇలా చెల్లించాలి
‘ఈ’ మార్గంలో పన్ను చెల్లించాలనుకునేవారు డబ్ల్యు డబ్ల్యుడబ్ల్యు.సీడీఎంఏ.కామ్. వెబ్‌సైట్‌కు లాగాన్ అవాలి. అందులో ఎరుపు రంగు అక్షరాలతో ఉన్న యువర్ ట్యాక్స్ ఆన్‌లైన్‌రూ. అనే లింక్‌ను క్లిక్ చేయాలి. తద్వారా పన్ను చెల్లింపు వెబ్‌సైట్‌లోకి ప్రవేశించవచ్చు. అక్కడ నో యువర్ ప్రాపర్టీ ట్యాక్స్‌రూ. అని కనిపిస్తుంది. ఈ విండోలో అసెస్‌మెంట్ నంబర్ టైప్ చేస్తే సంబంధిత పన్ను బకాయి వివరాలు కనిపిస్తాయి. అసెస్‌మెంట్ నంబర్ తెలియనివారు ఇంటి యజయాని పేరు, డోర్ నంబర్ ఆధారంగా తెలుసుకోవచ్చు. యువర్ ప్రాపర్టీ ట్యాక్స్‌రూ. విండోలోనే కింది భాగంలోక్లిక్ టు నో యువర్ అసెస్‌మెంట్ నంబర్‌రూ. అని ఉన్న నీలి రంగు అక్షరాలపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి.
అసెస్‌మెంట్ నంబర్ ఎంటర్ చేశాక చెల్లించాల్సిన మొత్తం ఎంతో కనిపిస్తుంది. ఆ కిందనే *ట్యాక్స్ పే ఆన్‌లైన్‌రూ. అనే ఆప్షన్‌లో వివరాలు నమోదు చేసి, చెల్లించాల్సిన విధానం ఎంచుకుని, వెబ్‌సైట్ ఆదేశాలు అనుసరించాలి. ఇలా చెల్లించేందుకు ఆన్‌లైన్ బ్యాంక్ అకౌంట్ కానీ, ఏటీఎం డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఉండాలి. జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ నగరపాలక సంస్థలతో పాటు, అమలాపురం, తుని, మండపేట, రామచంద్రపురం, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం మున్సిపాలిటీల్లో ప్రజలు ఈ సేవలు వినియోగించుకోవచ్చు. నగర పంచాయతీల్లో మాత్రం ఇంకా ఈ సేవలకు అవకాశం కల్పించలేదు.
ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులకు వీలు కల్పిస్తే ఎక్కువమంది నుంచి సకాలంలో ఆస్తిపన్నులు రాబట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మొండి బకాయిలపై స్పెషల్ డ్రైవ్ చేయాలని కూడా జిల్లాలోని మున్సిపాలిటీలు యోచిస్తున్నాయి. ఈ తరుణంలో ఆన్‌లైన్ విధానం వల్ల ప్రయోజనం చేకూరుతుందని కమిషనర్లు భావిస్తున్నారు. ఆస్తిపన్ను వసూళ్లలో జిల్లా ఇప్పటికే వెనుకబడి ఉంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేయాల్సిన పన్ను మొత్తం రూ.54 కోట్లు కాగా, వసూలైంది సుమారు రూ.14.5 కోట్లు మాత్రమే. ఇంకా రూ.39.5 కోట్లు వసూలు కావాల్సి ఉంది. వీటిలో రాజమండ్రి నగరపాలక సంస్థలో రూ.16 కోట్లు, కాకినాడలో రూ.13.5 కోట్లు వసూలు కావాలి. వీటి వసూళ్లకు ఇంకా నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తేవడం వల్ల వసూళ్లు వేగవంతమవుతాయని అధికారులు అంటున్నారు.
Advertisement