ప్రాసిక్యూషన్ విభాగం డెరైక్టర్‌గా విద్యాసాగర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రాసిక్యూషన్ విభాగం డెరైక్టర్(డీవోపీ)గా సీహెచ్ విద్యాసాగర్‌రావు నియమితులయ్యారు. ఈ మేర కు న్యాయశాఖ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యాసాగర్‌రావు 1983లో ప్రాసిక్యూషన్ విభాగంలో ఏపీపీగా నియమితులయ్యారు.
ఏసీబీ, ఇంటెలిజెన్స్ తదితర విభాగాల్లో పలు హోదాల్లో విధులు నిర్వహించారు. గత రెండేళ్లుగా ప్రాసిక్యూషన్ విభాగం ఇన్‌చార్జ్ డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. కాగా, సీనియర్ జిల్లా జడ్జిలను మాత్రమే డీవోపీగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రాసిక్యూషన్ విభాగానికి చెందిన అధికారులను డీవోపీగా నియమించడం ఇదే ప్రథమం.