పేదలు సాగు చేసుకుంటున్న అటవీ భూముల్లో పంటలను ధ్వంసం చేయవద్దంటూ వ్యవసాయ కార్మిక సంఘం బుధవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. జిల్లాలోని పెంటకల్లు, తుగ్గలి గ్రామాల్లో సుమారు 70 ఎకరాల్లో 35 మందికి పైగా రైతులు పంట సాగు చేసుకుంటున్నారని.. వారిని రోడ్డున పడేయ్యద్దని కోరారు. ఈ గ్రామాల్లోని రైతులు 40 ఏళ్లుగా ఈ భూముల్లో పంట సాగు చేసుకుంటున్నారని వివరించారు. కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పెంటకల్లు, తుగ్గిలి గ్రామ రైతులు పాల్గొన్నారు.
అటవీ భూముల్లో పంటల జోలికి రావద్దు
Published Wed, Sep 16 2015 1:11 PM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM
Advertisement
Advertisement