10వ తరగతి పరీక్ష కేంద్రంలో మహిళ ఉపాధ్యాయురాలి పట్ల సహచర ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో సదరు మహిళ ఉపాధ్యాయురాలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే చెప్పు తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు కిష్టప్ప చెంప చెళ్లు మనిపించింది. అయితే మహిళ ఉపాధ్యాయురాలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది.
ఆ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని మహిళ ఉపాధ్యాయురాలికి ప్రధానోపాధ్యాయుడు హామీ ఇచ్చారు. ఆ ఘటన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఓ టెన్త్ క్లాస్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.