శ్రీకాకుళం: ఎంతో గుట్టుగా ఉంచాల్సిన పరీక్ష పేపర్లు వైబ్‌సైట్‌లో దర్శనమిచ్చారుు. ఈ విషయం తెలిసి పరీక్ష పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి పలువురు పోటీ పడ్డారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమైన త్రైమాసిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నాయి. 6, 7, 8 తరగతులకు చెందిన ప్రశ్నపత్రాలు పలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఆర్‌వీఎం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందనే విమర్శలు వస్తున్నారుు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రశ్నపత్రాలు తయారు చేసే బాధ్యత ఆర్‌వీఎం అధికారులది కాగా 9, 10 తరగతుల ప్రశ్నపత్రాలను విద్యాశాఖాధికారులు రూపొందిస్తారు.
ఆర్వీఎం అధికారులు ప్రశ్నపత్రాలను తయారు చేసే బాధ్యతలను స్కూల్‌కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. పేపర్ల తయారీకి ఒక్కో తరగతికి రెండున్నర రూపాయలు మాత్రమే రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు కేటాయించారు. ఇది చాలదని ప్రధానోపాధ్యాయులు పేపర్లు తాము తయారు చేయలేమని చెప్పేశారు. ఎన్నో విధాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆర్వీఎం అధికారులు ప్రశ్నపత్రాలను తయారు చేసే బాధ్యతను ఏఎంవో జగదీష్‌కు అప్పగించారు. ఓ ప్రింటర్‌కు నచ్చచెప్పి రెండున్నర రూపాయలకే ప్రశ్నపత్రాలు అచ్చు వేసేలా ఒప్పించారు. ఆర్వీఎం పీవోకు కానీ మరెవరికి కానీ చెప్పకుండా ఏఎంవో నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రశ్నాపత్రాలు లీకైనట్లు తెలిసింది. వాస్తవానికి ప్రశ్నాపత్రాల తయూరీకి కొందరు ఉపాధ్యాయులను కోరాల్సి ఉంది.
అలా కోరకుండా సమయం లేదన్న సాకుతో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో వెబ్‌సైట్‌లో ఉంచిన మోడల్ ప్రశ్నాపత్రాలనే త్రైమాసిక పరీక్షా ప్రశ్నాపత్రాలుగా ఏఎంవో ముద్రింపజేశారు. దీంతో కొంత మేర లీకవ్వగా ముద్రించిన ప్రశ్నాపత్రాలను ఎంఈవోలకు ఆర్‌వీఎం అధికారులు పంపించారు. అక్కడి నుంచి పాఠశాల స్థాయికి చేరాయి. ఇవేవీ ప్యాకింగ్, సీలు లేకుండానే సరఫరా చేయడంతో మొత్తం పేపర్లన్నీ లీకయ్యాయి. అలా కాకున్నా వెబ్‌సైట్‌లో ఉంచిన మోడల్ ప్రశ్నాపత్రాలనే ముద్రించారని బుధవారం మధ్యాహ్న సమయూనికే జిల్లావ్యాప్తంగా ప్రచారం జరిగిపోయింది. దీంతో అప్పటి వరకు మోడల్ ప్రశ్నాపత్రాలను డౌన్‌లోడ్ చేయని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సైతం ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో ఇకముందు జరగాల్సిన ఐదు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైనట్లైంది. దీన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యామ్నాయ ప్రశ్నపత్రాల కోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉపాధ్యాయుల కోసం ఉంచాం:ఏఎంవో జగదీష్
విషయాన్ని ఏఎంవో జగదీష్ వద్ద ‘సాక్షి’ప్రస్తావించగా సమయాభావం వల్ల మోడల్‌పేపర్లనే ముద్రించాల్సి వచ్చిందన్నారు. వాటిని కూడా ఉపాధ్యాయుల కోసం వెబ్‌సైట్‌లో ఉంచామే తప్పా విద్యార్థుల కోసం కాదన్నారు. వారు కూడా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేస్తే తాము చేయగలిగేది ఏమీ లేదన్నారు. పీవో గణపతిరావు వద్ద ప్రస్తావించగా మోడల్‌పేపర్లనే ముద్రించిన విషయం ఏఎంవో తన దృష్టికి తీసుకురాలేదన్నారు. దీనిపై దృష్టి సారించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
వెబ్‌సైట్‌లో క్వార్టర్లీ పరీక్షల ప్రశ్నపత్రాలు!
Published Thu, Oct 9 2014 1:46 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement