
చంద్రబాబు రుణమాఫీ చేయాల్సిందే
హైదరాబాద్ : రుణమాఫీపై చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీకి రీ షెడ్యూలు ప్రత్యామ్నాయం కాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. రుణాలు రీ షెడ్యూల్ చేయడం సరికాదని, రీ షెడ్యూల్తో రైతులకు న్యాయం జరగదని రఘువీరా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సిందేనని ఆయన అన్నారు.