సాక్షి, తిరుపతి: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదాకు గతంలోనే మాటిచ్చామని, ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా హోదా ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టంచేశారు. రాహుల్ గాంధీ శుక్రవారం తిరుపతి బహిరంగ సభలో పొల్గొని ప్రసంగించారు. హోదాపై బీజేపీ మాట తప్పిందని, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానిపై లేదా అని ప్రశ్నించారు. పేదవాడి ఖాతాలోకి రూ.15 వేస్తామన్న మోదీ హామీ ఏమైందని రాహుల్ నిలదీశారు. ఏటా రెండు కోట్లమందికి ఉద్యోగాలిస్తామన్న హామీని ప్రధాని గాలికొదిలేశారని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని రాహుల్ విమర్శించారు. రాఫెల్ డీల్ కుంభకోణంలో అనిల్ అంబానీకి మోదీ రూ.30వేలకోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం, భూసేకరణ చట్టం పేదలపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని రాహుల్ చెప్పారు. గత కాంగ్రెస్ హయాంలో రూ. 70వేల కోట్లు రైతు రుణమాఫీ చేసినట్లు రాహుల్ గుర్తుచేశారు. తాను ఎక్కడికి పోయినా మోదీని దొంగ దొంగ అని జనం అరుస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment