విశాఖపట్నం: తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు శనివారం వెల్లడించింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశాలున్నాయని తెలిపింది. అలాగే ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉత్తర కోస్తాపై కూడా కొంత ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. దీంతో ఉత్తర కోస్తాలో చిరు జల్లులు పడతాయని పేర్కొన్నారు. శ్రీలంక నుంచి తమిళనాడు వరకు ఉపరితల అవర్తనం వ్యాపించి ఉందని అధికారులు వెల్లడించారు.