
వైద్య విధానాన్ని గాడిలో పెడతాం: కామినేని
కడప : రాష్ట్రంలో గాడి తప్పిన వైద్య విధానాన్ని త్వరలో గాడిన పెడతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజంపేట ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో ట్రామా కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ... రాజంపేట ప్రభుత్వాస్పత్రిని త్వరలో మేటి ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. పేదలకు ఉచిత ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తామని శ్రీనివాస్ స్పష్టం చేశారు.