
రాజీవ్ స్వగృహదారుల సమస్య వివరిస్తున్న బాధితుడు
శ్రీకాకుళం అర్బన్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌లో 2007లో ఇళ్లను కొనుగోలు చేశామని, వాటికి సంబం ధించి ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయడం లేదని, రాజీవ్ స్వగృహదారుల ఇళ్లను త్వరితగతిన రిజిస్ట్రేషన్‌లు చేసేలా చూడాలని అనమిత్ర హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో శుక్రవారం అనమిత్ర హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు జగన్‌ను కలిసి సమస్య వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. యాభై కుటుంబాలు ఉంటున్నా కనీ స సదుపాయాలు కల్పించలేదన్నారు. ఇప్పటికైనా తమ ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయించాలని వేడుకున్నారు. జగన్‌ను కలసిన వారిలో జగదీష్, జి.రినా సిల్వియా, ఉషాసురేష్, మంగమ్మ, కృష్ణారావు, కస్తూరి ప్రకాష్ తదితరులు ఉన్నారు.
నాగవంశ కుల ప్రతినిధుల వినతి
శ్రీకాకుళం అర్బన్: నాగవంశం కులస్తులు బీసీ–డి లో ఉన్నారని, ఈ కులస్తులంతా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారని, ఈ కులస్తులను బీసీ–ఏలో చేర్చాలని సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన నాగవంశ కులసంఘ ప్రతినిధులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. కేశవరావుపేటలో ఏర్పాటు చేసిన శిబిరంలో వారు ప్రతిపక్ష నేతతో మాట్లాడారు. 2009, 2014 సా«ర్వత్రిక ఎన్నికల మేని ఫేస్టోలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాగవంశ కులస్తులను బీసీ–ఏ లో చేరుస్తామని హామీ ఇచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. జగన్‌ను కలసిన వారిలో నాగవంశ కులసంఘ ప్రతినిధులు ముగ్గు రామారావు, మడ్డు తాతయ్య, డొంక వెంకటరమణ, నూకరాజు, ఎంవిఎస్ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment