
తిరుపతి కల్చరల్: నగరంలోని వీవీ మహల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శుభమస్తు షాపింగ్ మాల్ షోరూం ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ షోరూంను ప్రారంభించగా, రాష్ట్ర మంత్రి ఎన్.అమరనాథరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. రకుల్ ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ ఏడుకొండల స్వామి పాదాల చెంత అద్భుత సంప్రదాయ వస్త్రాలయాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. శారీస్, టెక్స్‌టైల్స్, రెడీమేడ్స్, అన్ని రకాల వస్త్రాలు, వన్ గ్రాము జ్యుయలరీని శుభమస్తులో అందుబాటులో ఉంచారని తెలిపారు.
అధునాతన డిజైన్లు, మన్నిక, నాణ్యత కలిగిన మాల్‌గా ప్రజలకు చేరువై అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మంత్రి అమరనాథరెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో నాలుగు దశాబ్దాల కిందట న్యూ రాజ్యలక్ష్మిహాల్‌తో మొదలై.. నాలుగేళ్ల కిందట శుభమస్తుతో సరికొత్త షాపింగ్‌మాల్‌గా రూపొందిందన్నారు. తిరుపతిలో అతిపెద్ద షాపింగ్ మాల్ బ్రాంచ్‌ని ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల కు సరసమైన ధరలకు వస్త్రాలు అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, శుభమస్తు షాపింగ్‌మాల్ అధినేతలు బయ్యా శ్రీనివాసులు, బయ్యా వెంకటరవికుమార్, తిరుపతి నగర ప్రముఖులు, పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
రకుల్ అభిమానుల సందడి
రకుల్ ప్రీత్ సింగ్‌ను చూసేందుకు విశేష సంఖ్యలో అభిమానులు రావడంతో షాపింగ్‌మాల్ ప్రాంతం కిక్కిరిసింది. అభిమాన నటిని చూసేందుకు యువత ఎగబడ్డారు. అభిమానుల కేరింతలు హోరెత్తాయి. కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment