నెల్లూరు : గత ప్రభుత్వం మంజూరు చేసిన తోళ్ల పరిశ్రమను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలో సోమవారం భారీ ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. తోళ్ల పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో 4 వేల మందికి పైగా పాల్గొన్నారు.
కోట, వాకాడు, చిల్లకూరు మండలాల ప్రజలు కోటలోని సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తోళ్ల పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, రసాయనాలతో వాతావరణ, వాయు కాలుష్యం పెరుగుతోదని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.