సాక్షి, నెల్లూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సింహపురి వాసులు చేపట్టిన సమైక్య ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. 53 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసనదీక్షలతో సమైక్యవాణి వినిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా శనివారం నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. నెల్లూరులోని రామలింగాపురం సెంటర్‌లో ఇరిగేషన్ ఉద్యోగులు వెనక్కు నడుస్తూ నిరసన తెలిపారు. మహిళలకు రోడ్డుపై మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్‌వార్ పోటీలు నిర్వహించారు.
పొట్టిశ్రీరాములు జేఏసీ ఆధ్వర్యంలో బారాషహీద్ దర్గా ఆవరణ నుంచి అయ్యప్పగుడి, వేదాయపాళెం మీదుగా ఏసీసెంటర్, ఆత్మకూరు బస్టాండ్, ఆనం వెంకటరెడ్డి బొమ్మవరకు వాహనాలతో భారీ ర్యాలీ జరిగింది. ఎన్జీఓహోంలో పాలిటెక్నిక్ జేఏసీ, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా రిలేదీక్ష చేశారు. వీఆర్‌సీ కూడలిలో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో, యూటీఎఫ్, గాంధీబొమ్మ కూడలిలో ఎస్‌యూపీఎస్ ఆ ధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
నర్తకి సెంటర్‌లో వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వెంకటగిరిలోని కాశీపేట సెంటర్ జర్నలిస్టులు రిలే దీక్ష చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యం లో ఉపాధ్యాయులు దీక్షలో కూర్చున్నారు. ఆటపాటలతో నిరసన తెలిపారు. సైదాపురంలోని సీఆర్‌ఆర్ కళాశాల విద్యార్థులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు రిలే దీక్ష చేశారు. ఉదయగిరిలో జేఏసీ, వైఎస్సార్‌సీ పీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. దీక్షలో ఉన్న ఉపాధ్యాయులకు నా యీ బ్రాహ్మణులు మద్దతు ప్రకటించారు. దుత్తలూరు, సీతారామపురంలో దీక్షలు కొనసాగుతున్నాయి. సీతారామపురంలో ఉపాధ్యాయులు గోలీల ఆట ఆడి నిరసన తెలిపారు.
వింజమూరులో 46వ రోజు దీక్షలో నూర్‌బాషా సం ఘీయులు కూర్చున్నారు. కలిగిరిలో విద్యార్థి గర్జన జరిగింది. వరికుంటపాడులో తూర్పుచెన్నంపల్లికి చెందిన వివేకాయూత్ సభ్యులు దీక్ష చేశారు. ఉపాధ్యాయ, సమైక్య, విద్యార్థి జేఏసీ నాయకులు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఆత్మకూరులో నిర్వహించిన ఆత్మకూరు అరుపు మహాసభ విజయవంతం అయింది. ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. కావలిలో ఆర్టీసీ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బస్సును తాళ్లతో లాగి నిరసన తెలిపారు. ఉద్యోగుల జేఏసీ, వైఎస్సార్‌సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగాయి. సూళ్లూరుపేటలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు దీక్షలో కూర్చున్నారు. పులికాట్ పొలికేక పేరుతో అక్టోబర్ 1న నిర్వహిస్తున్న లక్షగర్జన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. తడలో మహిళా ఉపాధ్యాయులు, నాయుడుపేట లో వ్యవసాయాధికారులు, దొరవారిసత్రంలో ఉపాధ్యాయులు, పొదలకూరులోనూ ఉపాధ్యాయులు(ఏపీటీఎఫ్) రిలేదీక్షలు చే పట్టారు. బుచ్చిరెడ్డిపాళెంలో జేఏ సీ నాయకులు భిక్షాటన చేశారు. కోవూరులోని ఎన్జీఓహోంలో యు వకులు దీక్ష చేశారు. గూడూరులో సమైక్యవాదుల దీక్షలు కొనసాగా యి. టవర్‌క్లాక్ సెంటర్‌లో ప్రాస్ప రో, వివేకానంద, సెయింట్ మేరీస్ స్కూల్ వి ద్యార్థులు చేసిన విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
ఆగని పోరు
Published Sun, Sep 22 2013 5:08 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement