'చంద్రబాబు.. ప్రతిపక్షాలు రాక్షసులా..' | Ramakrishna condemned chandra babu comments | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు.. ప్రతిపక్షాలు రాక్షసులా..'

Published Sat, May 30 2015 12:07 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

'చంద్రబాబు.. ప్రతిపక్షాలు రాక్షసులా..' - Sakshi

'చంద్రబాబు.. ప్రతిపక్షాలు రాక్షసులా..'

విజయవాడ టౌన్: ప్రతిపక్షాలను రాక్షసులతో పోల్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగజారుడు వైఖరిని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో ఖండించారు. చంద్రబాబు సీఎంగా అధికారాన్ని చేపట్టి సంవత్సరం పూర్తయినా ఏనాడు ప్రతిపక్షాలను లెక్కచేయలేదని విమర్శించారు. ఏ ఒక్క ప్రాధాన్యతగల అంశంపైనా సంవత్సర కాలంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదంటే చంద్రబాబు ఏకపక్ష వైఖరి తేటతెల్లమవుతోందన్నారు.

ఏనాడు రాజధాని నిర్మాణం విషయంలో ప్రతిపక్షాల సలహాలను స్వీకరించని ముఖ్యమంత్రి.. తాము అడ్డుకుంటున్నామంటూ నిందలు మోపడం భావ్యం కాదన్నారు. సీఎంకు ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలపై గౌరవం ఉంటే తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి రాజధాని నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించాలని రామకృష్ణ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement