మళ్లీ కాటేస్తున్న కాళ్లవాపు | Rare Disease In East Godavari | Sakshi

మళ్లీ కాటేస్తున్న కాళ్లవాపు

Published Thu, Oct 4 2018 2:01 PM | Last Updated on Thu, Oct 4 2018 2:01 PM

Rare Disease In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: వరుసగా మూడేళ్లుగా ఏజెన్సీలో కాళ్లవ్యాపు వ్యాధి విజృంభిస్తోంది. గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నారు. భారీ సంఖ్యలో గిరిజనులు చనిపోతేనే అంతో ఇంతో స్పందించే ప్రభుత్వం ఒకరిద్దరు చనిపోతే కనీసం యంత్రాంగం ఆ వైపు కన్నెత్తి చూడడంలేదు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి..ఆనక మిన్నకుండిపోవడం షరా మామూలైంది. 2016 ఆగస్టు నుంచి అక్టోబర్‌ వరకు విలీన మండలాలు చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక, కూనవరం గ్రామాల్లో అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధి ప్రబలుతోం ది. 2016లో 15 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రిపాలయ్యా రు. ఆ సమయంలో హడావుడి చేసిన జిల్లా యం త్రాగం కొద్ది రోజుల తర్వాత మిన్నకుండిపోయింది. గతేడాది దాదాపు రెండు వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. తాజాగా   ఈ ఏడాది కూడా కాళ్లవాపు వ్యాధి వెంటాడుతోంది. ఈ నెల 1వ తేదీన వీఆర్‌పురం మండలం అన్నవరం గ్రామాని కి చెందిన పూనెం కన్నెమ్మ(50), 2వ తేదీన ప్రత్తిపాక గ్రా మానికి చెందిన పైదా రాముడు (55) కాళ్లవాపు వ్యాధితో మృత్యువాత పడ్డారు. ఐక్యరాజ్య సమితిలో రాష్ట్రం పేరును మార్మోగేలా చేశానని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు అరణ్యంలో జరిగే తమ బతుకులు, మరణాల వైపు కూడా ఓసారి చూడాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

మూలాలు ఎక్కడో కనిపెట్టలేదు..
కాళ్ల వాపు వ్యాధి ఎందుకు వస్తుందోనన్న విషయంపై విశాఖ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బాధితుల వద్ద నమూనాలు సేకరించినా వ్యాధి మూలాలు తేల్చలేకపోయింది. అంతకు ముందు నాటు సారా తాగడంతోనే ఇలా వస్తుందని ఉన్నతాధికారులు ప్రకటనలు చేసి ఆనక నాలుక్కరుచుకున్నారు. చివరకు వైద్యులు, యంత్రాంగం పౌష్టికాహారలేమి, మంచినీరు తాగకపోవడం వల్లే కాళ్లవాపు వచ్చిందని భిన్న ప్రకటనలు చేశారు.

పౌష్టికాహారం పంపిణీ ఎక్కడ..?
2016లో బాధిత పల్లెల్లో పర్యటించిన అప్పటి కలెక్టర్‌ అరుణ్‌ కుమార్, పీవో చక్రధర బాబు గిరిజనులు ఇళ్లలోకి వెళ్లి పరిశీలించారు. గిరిజనుల ఇళ్లలో బియ్యం అసలు వాడడంలేదని, కనీస పౌష్టికాహారం, వారికి లభించడంలేదని గుర్తించారు. గిరిజన తండాల్లోని వారికి ప్రత్యేకంగా నిత్యావసర సరులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా బియ్యంతోపాటు కందిపప్పు, బెల్లం, నూనె ఇవ్వాలని నిర్ణయించారు. రేషన్‌ దుకాణాల ద్వారా ఒకసారి ఇచ్చిన యంత్రాంగం ఆ తర్వాత మొహం చాటేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారికి సరుకులు అందలేదు. ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం అయిపోయాక నాటుసారా, జీడి పిక్కలతోనే ఆకలిని తీర్చుకుంటున్నారు. ఏళ్ల తరబడి కనీస ఆహారం, మంచినీరు లేక గిరిజ నులు పలు వ్యాధులు, రక్తహీనతతో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఏడాది ప్రాణ నష్టం జరుగుతున్నా గిరిజనుల విన్నపాలు అరణ్య రోదనగా మిగిలిపోతున్నాయి.

ముందు జాగ్రత్త ఏదీ..?
రెండేళ్లుగా వరుసగా కాళ్ల వ్యాపు వ్యాధి సెప్టెంబర్‌ నెలలోనే ఎక్కువగా ప్రబలుతోంది. వర్షాకాలంలో గిరిజనులకు కనీ స ఆహారం కూడా దొరకని పరిస్థితి. అంతేకాకుండా కొండవాగుల్లోని నీరు వర్షాల వచ్చే వ్యర్ధాల కారణంగా కలుషితమవుతున్నాయి. మరోదారి లేక ఆ నీటినే గిరిజనులు తాగుతున్నారు. పౌష్టికాహార లోపం వల్ల గిరిజనుల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాంతవాసులు వేగంగా వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. కాళ్లవాపు వ్యాధి ప్రబ లడంతో ఆ ప్రభావం మూత్ర పిండాలు, గుండె తదితర అవయవాలపై పడుతోందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యం లో గిరిజనులకు పౌష్టికాహారం అందేలా తగిన చర్యలు తీ సుకుని, కాళ్ల వాపు వ్యాధి ప్రబలడానికి ముందుగానే ని యంత్రణ చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా యంత్రాం గం మేల్కొనలేదన్న విమర్శలున్నాయి. ఫలితంగా ఈ ఏడాది కూడా కాళ్లవాపుతో గిరిజనులు మృతి చెందుతున్నారు.

పౌష్టికాహార లోపమే ప్రధాన కారణం...
ఆహారపు అలవాట్లు మారాలి. కనీస ఆహారం వారికి దొరకదు. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం, ఇతర వస్తువులు ఉపయోగించడంలేదు. ఫలితంగా పౌష్టికాహార లోపం తలెత్తుతోంది. పిల్లలు, పెద్దల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటోంది. జీలుగు కల్లు, నాటుసారా ఎక్కువగా తాగుతున్నారు. పరిశుభ్రమైన నీరు తాగడంలేదు. కిడ్నీ విఫలమై చివరి దశలో ఆస్పత్రికి వస్తున్నారు. అప్పటి వరకు స్థానికంగానే నాటు మందులు, పెయిన్‌కిల్లర్‌ మందులు వాడుతున్నారు. పౌష్టికాహారం తీసుకునేలా గిరిజనులను చైతన్యం చేయాలి.– టి.రమేష్‌కిశోర్, జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి

వైద్య శిబిరాలునిర్వహించేందుకు ఏర్పాట్లు
వీఆర్‌పురం మండలంలో కాళ్లవాపుతో గిరిజనులు మృతి చెందిన విషయం మా దృష్టికి వచ్చింది. మూడేళ్లుగా ఈ వ్యాధి వస్తుందని గణాంకాలున్నాయి. 2016లో బాధితులకు కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు కేటాయించి వైద్యం అందించాం. ఈ సారీ అదే విధంగా చేసేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడుతున్నాను. కాళ్లవాపు వ్యాధితో మృతి చెందిన గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.– టీఎస్‌ఆర్‌ మూర్తి, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి, కాకినాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement