డెంకాడ: అక్రమంగా దారి తప్పుతున్న 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ మినీ లారీలో తరలిస్తుండగా విజయనగరం జిల్లా డెంకాడ మండలం అక్కివరం జంక్షన్ వద్ద శుక్రవారం విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. వ్యాపారి శ్రీనివాసరావు, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.