సీమ నేతల రాయల తెలంగాణ ఉద్యమం? | Rayalaseema leaders to take up Rayala Telangana movement? | Sakshi
Sakshi News home page

సీమ నేతల రాయల తెలంగాణ ఉద్యమం?

Published Mon, Nov 18 2013 12:55 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Rayalaseema leaders to take up Rayala Telangana movement?

హైదరాబాద్ : కర్నూలు, అనంతపురం జిల్లా నేతలు  రాయల తెలంగాణ కోసం ఉద్యమించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.  ఇదే విషయంపై  కేంద్రంతో చర్చించడానికి మంత్రి రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఢిల్లీ వెళనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో  కృష్ణదేవరాయ, రాయలసీమ విశ్వవిద్యాలయాల విద్యార్థి ప్రతినిధులు సోమవారం రఘువీరారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో సీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కోరారు.  అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని రాయల తెలంగాణపై పోరాడేందుకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి రఘువీరా తెలిపారు. కాగా రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయల తెలంగాణకు తాము సిద్ధమంటూ సీమా నేతలు ఇప్పటికే తమ మనసులో మాటను బయటపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement