చుక్కలు చూసిన చంద్రుడు!
రాష్ట్ర రాజధాని ప్రకటన చేసే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని సందర్భాల్లో చుక్కలు చూడాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శరపరంపరగా ప్రశ్నలు సంధించడంతో వాటికి తమవాళ్లతో ఏం సమాధానాలు చెప్పించాలో తెలియక , తాను చేసిన తప్పులను ఎలా సమర్థించుకోవాలో అర్థం కాక చంద్రుడు చుక్కలు చూశాడు!
రాజధాని ప్రకటనపై చర్చలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా నిలదీశారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన బాబుకు తన సొంత ప్రాంతంపై ఏమాత్రం ప్రేమ ఉందని కడిగేశారు. సాధారణంగా ఎవరైనా సొంత ప్రాంతానికి అంతో ఇంతో చేయాలనుకుంటారని, కానీ అసలే వెనకబడ్డ ప్రాంతమైన రాయలసీమను అదే ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఆయనీ వ్యాఖ్యలు చేసేటప్పుడు టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. మరోవైపు చంద్రబాబు ముఖం మాత్రం వాడిపోయింది.
శివరామకృష్ణన్ కమిటీలో సభ్యులంతా గొప్ప స్థాయి ఉన్నవాళ్లే అయినా.. ఆ నివేదికను పక్కన పెట్టేశారని రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధానిపై ఓ కమిటీ వేసిందని, అంఉదలో ఏడుగురు సభ్యులుంటే ఆరుగురు వ్యాపారవేత్తలని చెప్పారు. వాళ్లంతా విత్తనాలు, బ్యాటరీలు తయారు చేసేవాళ్లు, స్కూళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్లని విమర్శించారు.