rajendra nath reddy
-
మాయ మాటలు.. భ్రమలు
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టిన బుగ్గన సాక్షి, హైదరాబాద్: ‘‘ఎన్నికలకు ముందు జనాన్ని హామీలతో సంతోషపెట్టారు. ఓట్లు వచ్చాక మీరు సంతోషపడ్డారు. మిమ్మల్ని సం తోషపెట్టాం, మేమూ సంతోషపడుతున్నాం. ఎన్నికల సమయంలో మిమ్మల్ని సంతోషపెట్టాం, ఇప్పుడు మేం సంతోషిస్తున్నాం. రెంటికీ సరిపోయింది కదా..’’ అన్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం తీరుందని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, 9 గంటల విద్యుత్, గుడిసెలు లేని ఇళ్లు, ఇంటింటికీ ఉద్యోగం అంటూ హామీల మోత మోగించిన మీరు ఒక్కటైనా అమలుకు ప్రయత్నిస్తున్నా రా? అంటూ మండిపడ్డారు. ‘రుణమాఫీ రూ.80 వేల కోట్లయితే కేవలం రూ.3 వేల కోట్లతో చేతులు దులుపుకున్నారు. డ్వాక్రా రుణాలు రూ.14,200 కోట్లు, అపరాధ వడ్డీ రూ.2,500 కోట్లు కలిపి మొత్తం సుమారు రూ.17,000 కోట్లు ఉంది. 60 ఏళ్లు దాటితే పెన్షన్లు ఇస్తుండేవారు. ఇప్పుడేమో 65 ఏళ్లు దాటితేగానీ ఇవ్వడం లేదు. ఇదేనా మీ ప్రభుత్వ తీరు’ అంటూ దుయ్యబట్టారు. మాఫీలంటూ జనాన్ని మాయచేసి అధికారంలోకి వచ్చాక ఒక్క పథకాన్నీ అమలు చేయడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను ఏమార్చుతుందో ఆయన సభలో వివరించారు. ‘పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్ సమయంలోనూ, ఎమ్మెల్సీల పెంపు సమయంలో నూ రెండుసార్లు విభజన చట్టానికి సవరణ జరి గింది. ఈ సవరణ జరుగుతున్నప్పుడైనా కేం ద్రంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం పోరాడిందా?’ అని నిలదీశారు. దీనిపై మంత్రి ఉమా స్పందిస్తూ.. బాబు ప్రమాణ స్వీకారం చెయ్యకముందే పోలవరం ఆర్డినెన్స్ వచ్చిందని చెప్పారు. అప్పులు మీ హయాంలోనే 1991 నాటికి అప్పుల శాతం 21గా ఉంది. 2004 నాటికి 32 శాతానికి పెరిగింది. 2014 వచ్చేసరికి 22 శాతానికి తగ్గింది. అంటే 12 శాతం తగ్గినట్టు. దీన్ని మీరు గమనించారా అని బుగ్గన ప్రశ్నించారు. అంకెల గారడీ చూపింథ చేందుకు లక్ష కోట్ల బడ్జెట్ అంటున్నారని, 25 వేల కోట్ల లోటును అధిగమించేందుకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసమర్థులను క్షమిస్తారు, అమాయకులను భరిస్తారు, ఇంతలో చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి ప్రత్తిపాటి జోక్యం చేసుకుని, రాజేంద్రనాథ్‌రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల నిర్వీర్యం: స్థానిక సంస్థల అధికారాలకు సంబంధించి రాజ్యాంగంలో బలమైన హక్కులున్నాయి. కానీ నేడు ఆ సంస్థల ప్రతినిధులు ఏం చేయాలో ప్రశ్నించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులున్నారు, అధికారులున్నారు, కింది స్థాయి సిబ్బంది ఉన్నారు కానీ చంద్రబాబు ఒక్కరే పనిచేస్తున్నట్టు చెప్పడం ఏంటని, వీలైతే మీ సీఎంను ఒక్కసారి అడగాలని టీడీపీ సభ్యులకు సూచించారు. శివరామకృష్ణన్ హైపవర్ కమిటీపర్యటనలో ఉండగానే రాజధాని ఎక్కడో మీరే నిర్ణయించారు. భూములు తీసుకుంటున్నారు. ఏడాదికి మూడుపైర్లు వచ్చే భూములను ఎలా సేకరించారు? సీఆర్డీఏ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకముందే ఒక్క ఎకరా కూడా స్వాధీనం చేసుకోకూడదు. కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకే పట్టిసీమను చేపడుతున్నారని బుగ్గన మండిపడ్డారు. -
రెస్టు రూమ్‌కెళ్లినా రాజకీయమేనా!
అధికార పక్షానికి ప్రతిపక్ష నేత జగన్ చురకలు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలంటూ హితవు సాక్షి, హైదరాబాద్: ‘శాసనసభలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. రెస్టు రూమ్‌కు వెళ్లినా రాజకీయం చేస్తారా?’ అని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పక్షాన్ని నిలదీశారు. రాజధానిపై గురువారం అసెంబ్లీలో సీఎంచంద్రబాబు సుదీర్ఘ ప్రకటన చేసిన తర్వాత, విపక్ష సభ్యుడు రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ మాట్లాడారు. అనంతరం బీజేపీ సభ్యుడు సత్యనారాయణకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో జగన్ లేచి బయటకు వెళ్లారు. వెంటనే మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకొని.. ‘ముఖ్యమైన అంశం మీద చర్చ జరుగుతోంది. విపక్ష నేత సభలో లేరు. మళ్లీ వస్తారో లేదో తెలియదు. హడావుడి చేయించి జారుకున్నారు. చర్చించకుండా ఇంటికి జారుకోవడం విపక్ష నేతల లక్షణం కాదు. జగన్ చల్లగా ఇంటికి జారుకున్నారు’ వంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. సత్యనారాయణ తన ప్రసంగాన్ని కొనసాగించారు. నాలుగైదు నిమిషాల తర్వాత జగన్ తిరిగి తన స్థానానికి వచ్చి కూర్చున్నారు. యనమల వ్యాఖ్యలను పార్టీ సభ్యులు ఆయనకు చెప్పారు. స్పందించిన జగన్.. ‘రెస్టురూమ్‌కు వెళ్లినా రాజకీయం చేస్తారా? ఎంత దారుణమైన పరిస్థితి సభలో ఉంది. ఎంత అప్రజాస్వామికం. ముందుగా చర్చించకుండానే ముఖ్యమంత్రి రాజధానిపై సభలో ప్రకటన చేశారు. రెండున్నర గంటలు మాట్లాడారు. అధికార పక్ష సభ్యులు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి’ అంటూ చురకలు వేశారు. ఇరుకున పడిన యనమల నీళ్లు నములుతూ.. తన వ్యాఖ్యలకు స్పందించి విపక్ష నేత వెనక్కి వచ్చినందుకు ధన్యవాదాలంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. -
చుక్కలు చూసిన చంద్రుడు!
రాష్ట్ర రాజధాని ప్రకటన చేసే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని సందర్భాల్లో చుక్కలు చూడాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శరపరంపరగా ప్రశ్నలు సంధించడంతో వాటికి తమవాళ్లతో ఏం సమాధానాలు చెప్పించాలో తెలియక , తాను చేసిన తప్పులను ఎలా సమర్థించుకోవాలో అర్థం కాక చంద్రుడు చుక్కలు చూశాడు! రాజధాని ప్రకటనపై చర్చలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా నిలదీశారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన బాబుకు తన సొంత ప్రాంతంపై ఏమాత్రం ప్రేమ ఉందని కడిగేశారు. సాధారణంగా ఎవరైనా సొంత ప్రాంతానికి అంతో ఇంతో చేయాలనుకుంటారని, కానీ అసలే వెనకబడ్డ ప్రాంతమైన రాయలసీమను అదే ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఆయనీ వ్యాఖ్యలు చేసేటప్పుడు టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. మరోవైపు చంద్రబాబు ముఖం మాత్రం వాడిపోయింది. శివరామకృష్ణన్ కమిటీలో సభ్యులంతా గొప్ప స్థాయి ఉన్నవాళ్లే అయినా.. ఆ నివేదికను పక్కన పెట్టేశారని రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధానిపై ఓ కమిటీ వేసిందని, అంఉదలో ఏడుగురు సభ్యులుంటే ఆరుగురు వ్యాపారవేత్తలని చెప్పారు. వాళ్లంతా విత్తనాలు, బ్యాటరీలు తయారు చేసేవాళ్లు, స్కూళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్లని విమర్శించారు.