capital city declaration
-
సీఎం జగన్ ఆలోచన మంచి నిర్ణయం: టీజీ
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకోవడం మంచి నిర్ణయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రశంసించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంద్ర ఉద్యమ సమయంలో ఈ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాయలసీమ హక్కుల ఐక్య వేదిక తరఫున పోరాటం చేశామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన తుగ్లక్ వ్యాఖ్యలను ఖండించారు. రాజధాని వికేంద్రీకరణ చేస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుందని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తెరమీదకు తీసుకువచ్చి అక్కడ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశామని ప్రస్తావించారు. విశాఖలో పరిపాలన రాజధానితోపాటు రాయలసీమ ప్రాంతంలో ప్రాంతీయ పరిపాలనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాయలసీమలో ఉత్తరాంధ్ర ప్రాంతాంల్లో మినీ అసెంబ్లీ భవనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఒక హైకోర్టుతో సరిపెట్టకుండా మినీ అసెంబ్లీ మినీ సెక్రటేరియట్ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని ప్రాంతాల్లో అన్ని విభాగాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చదవండి : 3 రాజధానులు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు ‘మూడు రాజధానులపై సర్వత్రా హర్షం’ ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! -
మాయ మాటలు.. భ్రమలు
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టిన బుగ్గన సాక్షి, హైదరాబాద్: ‘‘ఎన్నికలకు ముందు జనాన్ని హామీలతో సంతోషపెట్టారు. ఓట్లు వచ్చాక మీరు సంతోషపడ్డారు. మిమ్మల్ని సం తోషపెట్టాం, మేమూ సంతోషపడుతున్నాం. ఎన్నికల సమయంలో మిమ్మల్ని సంతోషపెట్టాం, ఇప్పుడు మేం సంతోషిస్తున్నాం. రెంటికీ సరిపోయింది కదా..’’ అన్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం తీరుందని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, 9 గంటల విద్యుత్, గుడిసెలు లేని ఇళ్లు, ఇంటింటికీ ఉద్యోగం అంటూ హామీల మోత మోగించిన మీరు ఒక్కటైనా అమలుకు ప్రయత్నిస్తున్నా రా? అంటూ మండిపడ్డారు. ‘రుణమాఫీ రూ.80 వేల కోట్లయితే కేవలం రూ.3 వేల కోట్లతో చేతులు దులుపుకున్నారు. డ్వాక్రా రుణాలు రూ.14,200 కోట్లు, అపరాధ వడ్డీ రూ.2,500 కోట్లు కలిపి మొత్తం సుమారు రూ.17,000 కోట్లు ఉంది. 60 ఏళ్లు దాటితే పెన్షన్లు ఇస్తుండేవారు. ఇప్పుడేమో 65 ఏళ్లు దాటితేగానీ ఇవ్వడం లేదు. ఇదేనా మీ ప్రభుత్వ తీరు’ అంటూ దుయ్యబట్టారు. మాఫీలంటూ జనాన్ని మాయచేసి అధికారంలోకి వచ్చాక ఒక్క పథకాన్నీ అమలు చేయడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను ఏమార్చుతుందో ఆయన సభలో వివరించారు. ‘పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్ సమయంలోనూ, ఎమ్మెల్సీల పెంపు సమయంలో నూ రెండుసార్లు విభజన చట్టానికి సవరణ జరి గింది. ఈ సవరణ జరుగుతున్నప్పుడైనా కేం ద్రంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం పోరాడిందా?’ అని నిలదీశారు. దీనిపై మంత్రి ఉమా స్పందిస్తూ.. బాబు ప్రమాణ స్వీకారం చెయ్యకముందే పోలవరం ఆర్డినెన్స్ వచ్చిందని చెప్పారు. అప్పులు మీ హయాంలోనే 1991 నాటికి అప్పుల శాతం 21గా ఉంది. 2004 నాటికి 32 శాతానికి పెరిగింది. 2014 వచ్చేసరికి 22 శాతానికి తగ్గింది. అంటే 12 శాతం తగ్గినట్టు. దీన్ని మీరు గమనించారా అని బుగ్గన ప్రశ్నించారు. అంకెల గారడీ చూపింథ చేందుకు లక్ష కోట్ల బడ్జెట్ అంటున్నారని, 25 వేల కోట్ల లోటును అధిగమించేందుకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసమర్థులను క్షమిస్తారు, అమాయకులను భరిస్తారు, ఇంతలో చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి ప్రత్తిపాటి జోక్యం చేసుకుని, రాజేంద్రనాథ్‌రెడ్డి అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల నిర్వీర్యం: స్థానిక సంస్థల అధికారాలకు సంబంధించి రాజ్యాంగంలో బలమైన హక్కులున్నాయి. కానీ నేడు ఆ సంస్థల ప్రతినిధులు ఏం చేయాలో ప్రశ్నించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులున్నారు, అధికారులున్నారు, కింది స్థాయి సిబ్బంది ఉన్నారు కానీ చంద్రబాబు ఒక్కరే పనిచేస్తున్నట్టు చెప్పడం ఏంటని, వీలైతే మీ సీఎంను ఒక్కసారి అడగాలని టీడీపీ సభ్యులకు సూచించారు. శివరామకృష్ణన్ హైపవర్ కమిటీపర్యటనలో ఉండగానే రాజధాని ఎక్కడో మీరే నిర్ణయించారు. భూములు తీసుకుంటున్నారు. ఏడాదికి మూడుపైర్లు వచ్చే భూములను ఎలా సేకరించారు? సీఆర్డీఏ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకముందే ఒక్క ఎకరా కూడా స్వాధీనం చేసుకోకూడదు. కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకే పట్టిసీమను చేపడుతున్నారని బుగ్గన మండిపడ్డారు. -
గోబెల్స్‌కే ‘బాబు’ల్లా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో టీడీపీ నేతల వ్యవహార శైలి బోడిగుండుకూ, మోకాలికీ ముడిపెట్టే చందంగా ఉంటోంది. ప్రజా సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చలకు వేదికగా ఉండాల్సిన శాసనసభను.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన బంధువులు, వైఎస్సార్సీపీ నేతలపై అసత్య ప్రచారానికి అధికార పక్షం వాడుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు చేస్తున్న ఆరోపణలు నరం లేని నాలుక ఎలాగైనా తిరుగుతుందనే చందంగా ఉంటున్నాయి. ప్రకాశం జిల్లా కొనకనమిట్ట గ్రామంలో భూముల కొనుగోలు, నరసింహారెడ్డి అనే వ్యక్తి హత్య కేసు విషయాల్లో.. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న పచ్చి అబద్ధాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఎక్కడైనా వ్యక్తి హత్యకు గురైతే కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం పోలీసు విభాగం విధి. ప్రకాశం జిల్లాలో నరసింహారెడ్డి అనే వ్యక్తి గత నెల 23నో 24నో హత్యకు గురైతే పోలీసులతో విచారణ జరిపించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. తర్వాత దోషులెవరనేది కోర్టు నిర్ధారిస్తుంది. దీనిని ఎవరూ కాదనరు. అలా కాకుండా ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వీరప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి.. ఈ హత్యకు కారణమంటూ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ అధినేత ఎలా వ్యాఖ్యానిస్తారు? ముఖ్యమంత్రే ఇలా మాట్లాడితే ఆ ప్రభావం కేసు విచారణపై పడదా? అనే విచక్షణ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు ఉండాలి. అది మచ్చుకైనా ప్రస్తుత పాలకపక్షంలోని వారికి లేదనడానికి వారి వ్యాఖ్యలే నిదర్శనం. కరువు, హుద్ హుద్ సాయంలో అక్రమాలు తదితరాలు చర్చకు వస్తే టీడీపీ అవినీతి బయటపడుతుందనే.. వాటిని చర్చకు రానీకుండా ఇలా ఓ వ్యక్తిగత హత్యను రాజకీయాలకు ముడిపెట్టి రాద్ధాంతం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నది టీడీపీ హయాంలోనే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సోదరుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మామ గండ్లూరి వీరప్రతాప్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు ప్రకాశం జిల్లా కొనకనమిట్ట గ్రామంలో భూములు కొనుగోలు చేశారు. వ్యాపారవేత్త అయిన వీరప్రతాప్‌రెడ్డి గత ఏడాది ఆగస్టు 30వ తేదీ తర్వాతే అక్కడ భూములు కొన్నారు. ఈ ఏడాది జనవరి వరకు ఆయన భూములు కొన్నట్లు వారి సంబంధీకులు ఆధారాలు కూడా చూపుతున్నారు. అప్పటికే టీడీపీ అధికారంలోకి రావడమే కాకుండా.. విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని అప్పటికే ప్రకటనలు వచ్చాయి. అంటే విజయవాడ పరిసరాల్లో రాజధాని వస్తుందని తెలిసిన తర్వాతే ఈ భూముల కొనుగోలు లావాదేవీలు జరిగాయి. దొనకొండలో రాజధాని ఏర్పాటు చేద్దామనే దురుద్దేశంతోనే భూములు కొనుగోలు చేసినట్లు టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలనడానికి ఇది నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. భూములు అమ్మడానికి నిరాకరించినందున నరసింహారెడ్డి హత్యకు గురయ్యారంటూ పాలక పక్ష నేతలు చట్టసభలో ఆరోపించడం ఏమాత్రం సబబు కాదు. విచారణ జరి పించి దోషులకు శిక్ష పడేలా చూడాల్సిన పాలక పక్ష నేతలు విచారణను ప్రభావితం చేసేలా ఆరోపణలు గుప్పించడాన్ని బట్టే వారి కుటిల నీతి ఏమిటో అర్థమవుతోందని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. బంధువులకు ఏమిటి సంబంధం? వీరప్రతాప్రెడ్డికి ఎన్నో వ్యాపారాలున్నాయి. అయన, ఆయన బంధువులు భూములు కొనుగోలు చేశారు. ఇదెలా తప్పవుతుంది? అసలు నరసింహారెడ్డిది హత్యా..? కాదా? ఒక వేళ హత్య అయితే ఎందుకు జరిగిందో? ఎవరు చేశారో తేలకముందే ఒక పారిశ్రామికవేత్తపై అసెంబ్లీ సాక్షిగా అభియోగాలు మోపడం రాజకీయ కక్షసాధింపు కాదా? కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి వీరప్రతాప్‌రెడ్డి మామ కావడంవల్లే టీడీపీ ఇలా హత్య కేసును ఆపాదిస్తోందని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు అవినాష్‌రెడ్డి బంధువు, అవినాష్‌రెడ్డికి వీరప్రతాప్‌రెడ్డి బంధువు. ప్రకాశం జిల్లాలో హత్యకు గురైన నరసింహారెడ్డి.. వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి బంధువని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. మరి వైవీ సుబ్బారెడ్డి కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డికి బంధువే కదా. మరలాంటప్పుడు నరసింహారెడ్డి మరణంతో బంధుగణానికి ఉన్న సంబంధం ఏమిటి? నిజానిజాలు తేలకముందే బంధువులకు హత్యను అంటగట్టడం టీడీపీ నైజమా? అని వైఎస్సార్సీపీ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే బాబు పాత్ర ఉన్నట్లేగా? టీడీపీ నేతల మాటల ప్రకారం చూస్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని తన నివాసంలో సినీ నటుడు బాలకృష్ణ కాల్పులు జరిపిన కేసులో ఆయన బంధువైన చంద్రబాబు, అలాగే భువనేశ్వరి, లోకేష్‌ల పాత్ర ఉన్నట్లేనా? అని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘2004లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది బాలకృష్ణ తన నివాసంలో కాల్పు లు జరిపినట్లుగా కేసు నమోదైంది. ఈ కాల్పు ల్లో సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరి గాయపడ్డారు. దీంతో బాలకృష్ణపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయినా.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఈ కేసు విషయంలో చంద్రబాబుపైనగానీ, ఆయన కుటుం బసభ్యులపై గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అప్పట్లో ఈ కేసును విచారించిన పోలీసు అధికారి ప్రస్తుతం బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలోనే పనిచేస్తున్నారు. ఈ కేసు విషయంలో మేమెప్పుడైనా నందమూరి కుటుంబసభ్యులపై గానీ, చంద్రబాబుపైగానీ ఆరోపణలు చేశామా? ఇలా నిజానిజాలు తెలుసుకోకుండా కుటుంబాలను రచ్చకీడ్చడం మా నైజం కాదు. టీడీపీ నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా రాజ కీయ స్వార్థంతో అబద్దపు ఆరోపణలు చేస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలనడానికి ఇవీ నిదర్శనాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. వీటికి టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీరప్రతాప్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారు ‘నరసింహారెడ్డి హత్యకు గురైనట్లు చెబుతున్న రోజు వీరప్రతాప్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారు. నగరంలోని ఒక హో టల్లో తన మనవరాలి పుట్టిన రోజు వేడుకలను వీరప్రతాప్‌రెడ్డి దగ్గరుండి జరిపిం చారు. అయినా ఆయనే హత్య చేశారని టీడీపీ నేతలు అనడం దారుణం..’ అని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. -
చుక్కలు చూసిన చంద్రుడు!
రాష్ట్ర రాజధాని ప్రకటన చేసే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని సందర్భాల్లో చుక్కలు చూడాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శరపరంపరగా ప్రశ్నలు సంధించడంతో వాటికి తమవాళ్లతో ఏం సమాధానాలు చెప్పించాలో తెలియక , తాను చేసిన తప్పులను ఎలా సమర్థించుకోవాలో అర్థం కాక చంద్రుడు చుక్కలు చూశాడు! రాజధాని ప్రకటనపై చర్చలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా నిలదీశారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన బాబుకు తన సొంత ప్రాంతంపై ఏమాత్రం ప్రేమ ఉందని కడిగేశారు. సాధారణంగా ఎవరైనా సొంత ప్రాంతానికి అంతో ఇంతో చేయాలనుకుంటారని, కానీ అసలే వెనకబడ్డ ప్రాంతమైన రాయలసీమను అదే ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఆయనీ వ్యాఖ్యలు చేసేటప్పుడు టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. మరోవైపు చంద్రబాబు ముఖం మాత్రం వాడిపోయింది. శివరామకృష్ణన్ కమిటీలో సభ్యులంతా గొప్ప స్థాయి ఉన్నవాళ్లే అయినా.. ఆ నివేదికను పక్కన పెట్టేశారని రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధానిపై ఓ కమిటీ వేసిందని, అంఉదలో ఏడుగురు సభ్యులుంటే ఆరుగురు వ్యాపారవేత్తలని చెప్పారు. వాళ్లంతా విత్తనాలు, బ్యాటరీలు తయారు చేసేవాళ్లు, స్కూళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్లని విమర్శించారు. -
వికేంద్రీకరణ కుదరదు.. అన్నీ ఒకచోటే: చంద్రబాబు
రాష్ట్ర రాజధాని విషయంలో అధికార వికేంద్రీకరణ కుదరదని, ప్రధాన కార్యాలయాలు అన్నీ ఒకచోటే ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుండ బద్దలుకొట్టేశారు. అసెంబ్లీలో రాజధాని ప్రకటనపై చర్చ అనంతరం ఆయన మాట్లాడారు. ''కొన్ని సూచనలిచ్చారు. ఇంకా కొంతమంది ఇవ్వాలనుకుంటే రాతపూర్వకంగా కూడా ఇవ్వచ్చు. అవి పనికొస్తాయనుకుంటే పాజిటివ్‌గా పరిశీలిస్తాం. వ్యవసాయ భూముల సేకరణ వల్ల ఇబ్బంది అవుతుందని కొందరు ప్రస్తావించారు. ఎక్కడైనా వ్యవసాయ భూములు తీసుకుంటే ఎకరా భూమికి నీరు ఆదా అయితే వేరేచోట రెండెకరాలకు నీరు ఆదా అవుతుంది. వికేంద్రీకరణ చేయాలని కొంతమంది అన్నారు. ఎక్కడైనా పనుల మీద వచ్చినవాళ్లు వేర్వేరు చోట్లకు తిరగడం కుదరదు. అందుకని అధికార వికేంద్రీకరణ కుదరదు. డిజిటల్ ఏపీ అయినా.. వాటిని నడిపించేది మనుషులే. ఒక్కో ఊళ్లో ఒక్కో కార్యాలయం పెట్టాలంటే ప్రజలకు సౌకర్యంగా ఉండదు. రైతులను కోరుతున్నా.. మంచి రాజధాని కడదాం, మీకు కూడా లాభసాటిగా ఉండేలా తయారుచేద్దాం. అందరి సహకారం అవసరం. విశాఖపట్నంలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అయితే దాన్ని మరింత బలోపేతం చేసి మరింత ట్రాఫిక్ పెంచాల్సి ఉంటుంది. లాండ్ పూల్ సిస్టంతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తిరుపతిలో నా ఇంటి ముందే పదివేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ రాజధాని కావాలని నాకూ ఉంది. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ లాంటివి కట్టింది నేనే. సైబరాబాద్ నగరాన్ని కట్టింది నేనే. విశాఖలో ఐఐటీ కావాలన్నారు. ఒక ఐఐటీ ఇప్పటికే కేటాయించారు. రెండోది వస్తే అక్కడ తప్పకుండా ఏర్పాటు చేయిస్తాం. అరకు, లంబసింగి లాంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం'' అన్నారు. -
అసెంబ్లీ, గోల్కొండలూ బాబే కట్టించారేమో!!
-
అసెంబ్లీ, గోల్కొండ కోట కూడా బాబే కట్టించారేమో!!
హైదరాబాద్‌ను తానే నిర్మించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారని... అసెంబ్లీ, గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్ అన్నీ ఆయనే నిర్మించి ఉంటారేమోనని, అందుకే హైదరాబాద్ అంత గొప్పదై ఉంటుందని అనుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీలో రాజధాని ప్రకటనపై చర్చ సందర్భంగా ఆయన అధికారపక్షాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దుమ్ము దులిపేశారు. ఆయన ఏమన్నారంటే... ''చర్చ తర్వాత ప్రకటన వస్తే బాగుంటుందని ఎంత మొరపెట్టుకున్నా.. వినకుండా ముందే ప్రకటన చేసేశారు. నాయకులకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అది ఉండబట్టే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నా, ప్రతిపక్ష నాయకుడు దాన్ని స్వాగతించారు. అందుకే మిగులు బడ్జెట్ వచ్చిందని భావిస్తున్నాం. కాగితం మీద చూస్తే అన్నీ బాగానే ఉంటాయి. కానీ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవా, దేవాదుల, తోటపల్లి.. ఇలా అన్ని ప్రాజెక్టులకు ప్రతిసారీ ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేసేస్తారు తప్ప నిధుల కేటాయింపు, పూర్తి మాత్రం ఉండవు. నరమానవుడు కూడా లేనిచోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి తాపీ మేస్త్రిని, ఫొటోగ్రాఫర్‌ను కూడా హెలికాప్టర్లలో తీసుకెళ్లారట. ఇవన్నీ చదివారు గానీ, అవి పూర్తవుతాయా లేవా అన్నది చూడాలి. చేస్తే చాలా సంతోషిస్తాం. కానీ గత చరిత్ర చూసినప్పుడు బాధ వేస్తోంది. ఆయన శంకుస్థాపన చేసిన ఏ ప్రాజెక్టూ పూర్తి చేయలేదు. ప్రాజెక్టులు పూర్తయ్యాయంటే వాటికి దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేయించారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెబుతున్నా.. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి చేయించింది వైఎస్సే. హెచ్1బి వీసాలు వస్తున్నాయంటే.. అందుకు కారణం తానేనని చెబుతారు. నేనూ ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేశాను. అవెలా వస్తాయో మాకూ తెలుసు. ఆయన గత చరిత్ర చూస్తే భవిష్యత్తులో ఇవన్నీ జరుగుతాయన్న నమ్మకం ఎవరికీ కలగట్లేదు. గతంలో రాష్ట్రం తమిళనాడు నుంచి విడివడినప్పుడు 1956లో చర్చ ఎలా జరిగిందో, ఓటింగ్ ఎలా జరిగిందో ఆనాటి పేపర్లు చూస్తే తెలుస్తుంది. రాజధాని విషయంలో మేం ఎలాంటి డిమాండ్లూ చేయలేదు. శివరామకృష్ణన్ కమిటీ దొనకొండ, వినుకొండ, మార్టూరు విషయంలో వివరాలు అడిగినప్పుడు వాటికి సమాధానాలు కూడా పంపలేదు. ఏకపక్ష నిర్ణయాలు తగవు. సభ జరుగుతున్నప్పుడు సభ అభిప్రాయం కూడా తీసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడు రెండు నిమిషాల కోసం బయటకు వెళ్తేనే కామెంట్లు చేస్తారు గానీ.. రాష్ట్ర విభజన గురించి చర్చించేటప్పుడు ఆయన సభలో లేని విషయం గుర్తులేదా? '' -
ఏడు మిషన్లు.. ఐదు గ్రిడ్లు.. నాలుగు కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్య సాధనకు ప్రభుత్వం ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, నాలుగు కార్యక్రమాను చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రాథమిక రంగం, పట్టణీకరణతో పాటు స్మార్ట్ సిటీల నిర్మాణం, పారిశ్రామిక మిషన్, మౌలిక వసతుల రంగం, సేవారంగం, నైపుణ్యాభివృద్ధి రంగం, సామాజిక సాధికారత అనే ఏడు మిషన్లను చేపడుతున్నామన్నారు. అలాగే, అందరికీ నీరు అందించడం, 24 గంటల విద్యుత్ సరఫరా, ప్రతి ఇంటికీ గ్యాస్ సరఫరా, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కల్పించడం ప్రభుత్వం సంకల్పించిన ఐదు గ్రిడ్లలో ఉన్నాయని ఆయన అన్నారు. అలాగే.. ప్రగతి సాధనలో ప్రజలను భాగస్వామ్యం చేసి వారిలో ఉద్యమస్ఫూర్తిని కల్పించాలని ఐదు కార్యక్రమాలు చేపడుతుందని చంద్రబాబు చెప్పారు. అవి.. పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు అని తెలిపారు.