ఏడు మిషన్లు.. ఐదు గ్రిడ్లు.. నాలుగు కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్య సాధనకు ప్రభుత్వం ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, నాలుగు కార్యక్రమాను చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రాథమిక రంగం, పట్టణీకరణతో పాటు స్మార్ట్ సిటీల నిర్మాణం, పారిశ్రామిక మిషన్, మౌలిక వసతుల రంగం, సేవారంగం, నైపుణ్యాభివృద్ధి రంగం, సామాజిక సాధికారత అనే ఏడు మిషన్లను చేపడుతున్నామన్నారు.
అలాగే, అందరికీ నీరు అందించడం, 24 గంటల విద్యుత్ సరఫరా, ప్రతి ఇంటికీ గ్యాస్ సరఫరా, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కల్పించడం ప్రభుత్వం సంకల్పించిన ఐదు గ్రిడ్లలో ఉన్నాయని ఆయన అన్నారు. అలాగే.. ప్రగతి సాధనలో ప్రజలను భాగస్వామ్యం చేసి వారిలో ఉద్యమస్ఫూర్తిని కల్పించాలని ఐదు కార్యక్రమాలు చేపడుతుందని చంద్రబాబు చెప్పారు. అవి.. పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు అని తెలిపారు.