
రికార్డు స్థాయిలో బెల్లం లావాదేవీలు
* సీజన్‌లో గరిష్టంగా 32,664 దిమ్మల రాక
* కిటకిటలాడిన మార్కెట్
* రైతుల్లో ఉత్సాహం
అనకాపల్లి: అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో సోమవారం ఈసీజన్‌కు రికార్డు స్థాయిలో లావాదేవీలు సాగాయి. మార్కెట్‌కు 32664 దిమ్మలొచ్చాయి. ఈ నెల 22న మార్కెట్‌కు 25962 ది మ్మలు రాగా, సోమవారం పెద్ద మొత్తంలో రైతులు తీసుకురావడంతో మా ర్కెట్ కళకళలాడింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో రైతులు బెల్లాన్ని పెద్ద ఎత్తున తయారు చేసి మార్కెట్‌కు తరలించడం ఆనవాయితీ.
అయితే ధరలు నిరాశజనకంగానే ఉన్నాయి. సీజన్ మొత్తంగా ఈ నెల 19న క్వింటా రూ. 3120లు ధర పలకడంతో రై తుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. అనంతరం ధరల్లో పెరుగుదల ఆశించినంతగా లేదు. సోమవారం మొదటిరకం గరిష్టంగా రూ.2830లకు మాత్ర మే అమ్ముడుపోవడంతో రైతులు ధరల పరంగా నిరాశకు గురయ్యారు.