వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట అటవీ ప్రాంతంలో పోలీసులు శుక్రవారం కూంబింగ్ నిర్వహించారు.
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట అటవీ ప్రాంతంలో పోలీసులు శుక్రవారం కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలించేందుకు సిద్ధంగా ఉన్న మినీ లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో అక్కడే ఉన్న స్మగ్లర్లు పరారైయారు. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.