రిజిస్ట్రేషనుల ఢమాల్ | registrations are too down due to telangana effect | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషనుల ఢమాల్

Published Tue, Sep 3 2013 12:53 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

registrations are too down  due to telangana effect

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూముల, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. గత నెల రోజుల నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో డాక్యుమెంట్ల నమోదు పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా ఆ శాఖ ఆదాయం కూడా పడిపోయింది. గత నెల చివర్లో వెలువడిన రాష్ట్ర విభజన ప్రకటన స్థిరాస్తి రంగాన్నిమళ్లీ గడ్డుకాలంలోకి నెట్టేసింది. అప్పటివరకు  జోరుగా సాగిన ఇళ్లు, భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీనికితోడు ప్రస్తుతమున్న గందరగోళ పరిస్థితుల్లో నగరంలో ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. మరోవైపు భూముల, ఫ్లాట్ల డిమాండ్, ధర కూడా పడిపోవడంతో కారు చౌకగా విక్ర యించడానికి విక్రయదారులు ససేమిరా అంటున్నారు. గతేడాది తెలంగాణ ఉద్యమ ప్రభావంతో సైతం క్రయవిక్రయాలు పడిపోగా, గత ఆరు మాసాలుగా మళ్లీ  ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మార్కెట్ ధర పెరుగుతుందన్న ప్రకటన నేపథ్యంలో మార్చిలో పెద్దఎత్తున స్థలాలు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం చేసిన ప్రకటనతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండి పడింది. రిజిస్ట్రేషన్ శాఖ గ్రేటర్ హైదరాబాద్‌ను నాలుగు డీఆర్ (డిస్ట్రిక్ట్ రిజిష్ట్రార్లు)గా పరిగణిస్తుంది. వీటిలో హైదరాబాద్ జిల్లా పరిధిలో రెండు, రంగారెడ్డి జిల్లా పరిధిలో రెండు డీఆర్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 22 సబ్ రిజిస్రార్ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాలన్నింటిలోనూ గత నెలరోజుల నుంచి సందడి పూర్తిగా తగ్గిపోయింది. ఈ నెలలో సుమారు 16,932 దస్తావేజులు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో ఈ నెల ఆదాయ లక్ష్యం సైతం పడిపోయింది. గతేడాది ఇదే మాసంలో 19,526 దస్తావేజులు నమో దయ్యయి.
 
 సగానికి తగ్గిన ఆదాయం
 గ్రేటర్‌లో రిజిస్ట్రేషన్ శాఖకు ఆగస్టు మాసంలో ఆదాయం సగానికి పడిపోయింది. హైదరాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పరి శీలిస్తే నిర్దేశిత లక్ష్యం రూ.61.36 కోట్లు కాగా, అందులో 32.13 కోట్లు మాత్రమే సాధిం చింది. అదే గతేడాది పరిశీలిస్తే రూ.54.04 కోట్ల లక్ష్యానికి గాను రూ. 35.02 కోట్లవరకు లభించింది. గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పరిశీలిస్తే ఈ మాసం లక్ష్యం రూ. 152.32 కోట్లు కాగా సగం మాత్రమే లక్ష్యం సాధించగలిగింది. గతనెల ఆఖరులో సైతం తెలంగాణ ప్రకటన ప్రభావం రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంపై భారీగానే పడింది.
 
  రిజిస్ట్రేషన్ గణాంకాలివీ..
 
 హైదరాబాద్ జిల్లా
 నెల    డాక్యుమెంట్లు    ఆదాయం (కోట్లలో)     
 జూన్-2012    7576    44.08
 జూన్- 2013    3367    39.31    
 జూలై-2012    4797    71.16         
 జూలై- 2013    3821    41.06         
 ఆగస్టు-2012    3212    35.02
 ఆగస్టు-2013    3032    32.13    
 రంగారెడ్డి జిల్లా
 జూన్-2012    18564    124.90
 జూన్- 2013    19525    122.40
 జూలై-2012     26811    201.53
 జూలై- 2013    18224     150.27
 ఆగస్టు-2012     16314    134.72
 ఆగస్టు-2013     13900    86.29

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement