అలనాటి హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య కుమారుడు రేలంగి సత్యనారాయణ కన్నుమూశారు. ఇందిరాపార్కు సమీపంలోని స్వగృహంలో ఆయనకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వచ్చే సరికే సత్యనారాయణ మరణించారని వైద్యులు వెల్లడించారు.