జి.లకుష్మంనాయుడు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పార్వతీపురం జలవనరులశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న గంజి లకుష్మంనాయుడును విధులనుంచి తొలగించారు. జలవనరులశాఖ ఎస్‌ఈ ఆదేశాల మేరకు ఇన్‌చార్జ్ ఈఈ భాస్కరరావు మంగళవారం రిలీవింగ్ ఆర్డర్‌ను ఆయనకు అందజేశారు. ఇటీవల రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణకుమార్ విజయవాడలోని ఇంజి నీర్ ఇన్ చీఫ్‌కు ఆదేశాలు జారీ చేసినప్పటికీ లకుష్మంనాయుడుపై వేటు వేయకుండా ఆ శాఖ ఉన్నతాధికారులు తాత్సారం చేయడంతో ఈ నెల 24న సాక్షి దినపత్రికలో ‘అవినీతికి అండ’ అనే శీర్షికతో వెలుగులోకి తీసుకురావడంతో జలనవరులశాఖ ఉన్నతాధికారులు స్పందించారు.
ట్రిబ్యునల్ తిరస్కరణతో హడావుడిగా ఆదేశాలు
లకుష్మంనాయుడుకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు 2008లో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. దీనిపై గతేడాది డిసెంబర్ 20న విశాఖపట్నం ఏసీబీ కోర్టు మూడేళ్లు జైలు శిక్షతోపాటు లక్షరూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కానీ లకుష్మంనాయుడు ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు అపీల్ చేసుకుని వెనువెంటనే మళ్లీ విధుల్లో చేరా రు. ఈ విషయంపై జలవనరుల శాఖ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లకుష్మంనాయుడిపై చర్యలు తీసుకోవాలని విజ యవాడ ఈఎన్‌సీకి జీఓ జారీచేశారు. ఈఎన్‌సీ వెంటనే నిర్ణ యం తీసుకోకపోవడంతో లకుష్మంనాయుడు మరలా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. అక్కడ పిటిషన్ కొట్టేయడంతో ఆగమేఘాలమీద విధులనుంచి తొలగిస్తూ రిలీవింగ్ ఆర్డర్‌ను అందజేసింది. ప్రస్తుతం లకుష్మంనాయుడు పార్వతీపురంలో నివాసం ఉంటు న్న గృహం జలవనరుల శాఖకు సంబంధించినదే. ఈఈ కేడర్ ఉన్నవారు నివాసం ఉండడానికి నిర్మించిన ఆ భవనంలో ఎంతో కాలంగా ఈయన నివాసం ఉంటున్నారు. నేడో, రేపో ఆ గృహాన్ని కూడా ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment