రాజధాని భూగర్భంపై పరిశోధన
ముందుకొచ్చిన ఎన్‌జీఆర్‌ఐ భూకంపాల ముప్పును పసిగట్టేందుకే
విజయవాడ బ్యూరో: నవ్యాంధ్ర రాజధాని పరిధిలో భూపొరల స్థితిగతుల్ని ఎన్‌జీఆర్‌ఐ (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్,హైదరాబాద్) పరిశోధించనుంది. ఈ ప్రాంతం భూకంప జోన్-3లో ఉండడంతో భవిష్యత్తులో విపత్తు అవకాశాల్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎన్‌జీఆర్‌ఐని సంప్రదించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భాన్ని స్కాన్ చేయొచ్చని ఎన్‌జీఆర్ శాస్త్రవేత్తలు చెప్పడంతో దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్‌జీఆర్‌ఐ బృందం ముఖ్యమంత్రిని సైతం కలసి ఈ ప్రాజెక్టుపై చర్చించింది.
త్వరలో నిర్ణయం
212 చదరపు కి.మీ పరిధిలోని ప్రతిపాదిత రాజధానిలో భూపొరల్ని స్కానింగ్ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ డేటాను సేకరించాకే పనుల్ని చేపట్టాలని యోచిస్తోంది. భూగర్భ పొరల స్కానింగ్‌కు రూ.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.