సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: పురపాలక సంఘాల రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. మూడు నెల ల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సర్వోన్న త న్యాయస్థానం తేల్చిచెప్పిన నేపథ్యంలో మున్సిపాలిటీల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ శనివారం పురపాలకశాఖ ఉత్తర్వు లు జారీ చేసింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల రిజర్వేషన్లను ప్రకటించిన ప్రభుత్వం.. ఇబ్రహీంపట్నం. పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీలను ఎస్సీ(జనరల్)లకు కేటాయించింది. మేడ్చల్, బడంగ్‌పేట నగర పంచాయతీని బీసీ (జనరల్)కు కేటాయించగా, వికారాబాద్‌ను అన్‌రిజర్వ్ డ్ ఖరారు చేసింది. అలాగే తాండూరు మున్సిపాలిటీని జనరల్(మహిళ)గా ప్రకటించింది.
కోర్టు కేసుల నేపథ్యంలో వాయి దా పడుతుందనుకున్న మేడ్చల్ మున్సిపా లిటీకీ ఈ దఫాలోనే ఎన్నికలు నిర్వహించ నున్నారు. కాగా, ఆయా వార్డులు రిజర్వేషన్లను పురపాలకశాఖ ఇదివరకే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలతో నిమిత్తంలేకుండా పుర పోరును నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో వడివడిగా మున్సిపాలిటీల రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఇదిలావుండగా, నగర శివార్లలోని 35 గ్రామాలను కలుపుతూ కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడం, కొన్ని మున్సిపాలిటీల ఏర్పాటుపై న్యాయపరమైన అవరోధాలు తలెత్తడం వీటికి ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడంలేదు. మలి విడతలో వీటి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
మరోవైపు ఆదివారం ఆయా మున్సిపాలిటీల పరిధిల్లోని వార్డుల్లో ఓటర్ల జాబితాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసింది. ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని పురపాలకశాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆదివారం ఎన్నికల కమిషన్ మంగళవారం ఎన్నికల తేదీలపై కసరత్తు చేసే అవకాశముంది. అన్ని సవ్యంగా సాగితే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు.. ఈ ఎన్నికల నగారా మోగే వీలుందని అధికారవర్గాలు తెలిపాయి.
6 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు!
Published Sat, Mar 1 2014 11:23 PM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM
Advertisement