విజయవాడ: గోదావరి పుష్కర ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, పుష్కరాల ప్రత్యేకాధికారి జే మురళి, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్‌లతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్‌ఎం ప్రదీప్ కుమార్లు పాల్గొన్నారు.
రైల్వే శాఖ ఏర్పాట్లు, ప్రత్యేక రైళ్ల గురించి చర్చించారు. భక్తుల సౌకర్యార్ధం స్టేషన్ పరిసర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని డీఆర్‌ఎంను ప్రత్యేకాధికారి మురళి కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరీలు పాల్గొన్నారు.