‘బతుకు బండి భారమైందయ్యా.. ఒంట్లో ఓపిక లేదు.. మోకాళ్లలో సత్తువా లేదు. రోజంతా చెమటోడ్చినా ఐదువేళ్లూ నోట్లోకి పోయిన రోజే లేదు. ఏళ్ల తరబడి కష్టాల సంద్రాన్ని ఈదుతూనే ఉన్నా.. ఇంకా ఎన్నాళ్లీ అగచాట్లు. మా బతుకులు మారాలి. మార్పు రావాలి’ అంటున్నాడు రిక్షా కార్మికుడు పరమేశ్వర్. విజయవాడలోని సిద్థార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమీపంలో బుధవారం తన రిక్షాలో కూర్చొని సాక్షిదినపత్రిక చదువుతున్న ఆయనను పలుకరించగా.. ప్రస్తుత రాజకీయాలపై ఆవేదన వ్యక్తం చేశాడు. ‘రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. దోపిడీ పర్వం సాగుతోంది. ఈ అరాచక పాలన పోవాలన్నా.. పేదల బతుకుల్లో వెలుగులు విరబూయాలన్నా.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. నా ఓటు రాజన్న బిడ్డకే’ అని ఘంటాపథంగా చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment