కలికిరి, న్యూస్‌లైన్: వైఎస్సార్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కలికిరి మండలానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. కలికిరి మండలంలోని అద్దవారిపల్లె పంచాయతీ యర్రదొడ్డిపల్లెకు చెందిన దండే రామాంజులు(50), దండే సుందరయ్య(33) ఈ.సుబ్రమణ్యం(48) పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. వీరు ముగ్గురూ వైఎస్సార్‌జిల్లా రామాపురం మండలం నీలకంఠారావ్‌పేటలో సుందరయ్య చెల్లెలి భర్త కర్మక్రియలకు వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు.
చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం వైఎస్సార్ జిల్లా సంబేపల్లె మండలంలోని గుట్టపల్లె సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్నారు. ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న సంబేపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను రాయచోటి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రామాంజులుకు భార్య, ఏడు సంత్సరాల్లోపు ముగ్గురు పిల్లలున్నారు. సుందయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సుబ్రమణ్యానికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతులంతా కూలి పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకునే వారు. కుటుంబ పెద్దలు చనిపోవడంతో మూడు కుటుంబాలు వీధినపడ్డాయి.
యర్రదొడ్డిపల్లెలో విషాదఛాయలు
ఒకే గ్రామంలో పక్కపక్క ఇళ్లలో ముగ్గురు మృత్యువాతపడడంతో యర్రదొడ్డిపల్లెలో విషాదఛాయలు అల ముకున్నాయి. మృతులంతా బంధువులు కావడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం శోకసంద్రంలో మారింది. సర్పంచ్ పెద్దన్న మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని చెప్పారు.
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Published Tue, Aug 27 2013 6:59 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
Advertisement
Advertisement