హిమాయత్‌సాగర్ నుంచి తంగడపల్లి వరకు రోడ్డు వెడల్పునకుగాను ప్రభుత్వం రూ.9.65 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి. ప్రసాద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: హిమాయత్‌సాగర్ నుంచి తంగడపల్లి వరకు రోడ్డు వెడల్పునకుగాను ప్రభుత్వం రూ.9.65 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి. ప్రసాద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా విడుదల చేసిన నిధులతో ప్రస్తుతమున్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు పరిపాలన అనుమతులు లభించాయన్నారు. ఈ రోడ్డుపై పెరుగుతున్న రద్దీ దృష్ట్యా వెడల్పు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, ఈనేపథ్యంలో ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వానికి నివేదించామన్నారు. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేసిందన్నారు.