కృష్ణా జిల్లా నాగాయలంకలో గురువారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. నాగాయలంక ప్రధాన కూడలిలోని 11 షాపుల తాళాలు పగులకొట్టారు. ఆ షాపుల్లోని నగదు, వస్తువులను దొచుకెళ్లారు. ఆ విషయాన్ని షాపు యజమానులు శుక్రవారం ఉదయం గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అలాగే హైదరాబాద్ ఎల్బీ నగర్లోని యాదవ్ నగర్లో దోపిడి దొంగలు వరుసగా మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. అయా ఇళ్లలోని కుటుంబసభ్యులను కట్టేసి 19 తులాల బంగారం, 4 తులాల వెండి, రూ. 32 వేలు అపహరించుకుపోయారు. శుక్రవారం ఉదయం బాధితులు ఎల్బీ నగర్ పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.