సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడులో ఓ ఇంట్లో దొంగలు చొరబడి పెద్ద ఎత్తున సొత్తును అపహరించుకుపోయారు. గురువారం అర్ధరాత్రి సమయంలో చద్దిశెట్టి గౌరీశంకర్రావు నివాసంలోకి ప్రవేశించిన దొంగలు బీరువా తలుపులు తెరిచి 40 కాసుల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదును ఎత్తుకుపోయారు. ఆ సమయంలో గౌరీశంకర్ కుటుంబ సభ్యులు పక్క గదిలో నిద్రిస్తున్నారు. శుక్రవారం ఉదయం చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. జాగిలాన్ని రప్పించి దర్యాప్తు చేస్తున్నారు.