
వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
ఓంగోలు (ప్రకాశం) : ప్రకాశం జిల్లా ఓంగోలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని గ్రానైట్ వ్యాపారి ప్రసాద్ రెడ్డి ఇంట్లో దోపిడీ దొంగలు 70 సవర్ల బంగారం చోరీచేశారు. బంగారంతో పాటు రూ. 14 లక్షల నగదు అపహరణకు గురైందని బాధిత వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది.
అయితే, కుటుంబంతో సహా గ్రానైట్ వ్యాపారి పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ చోరీ జరిగిందని పోలీసులు వివరించారు. రాత్రి పదిగంటల సమయంలో ప్రసాద్ రెడ్డి ఇంటికి చేరుకునేసరికి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉన్న నగదు, బంగారం అపహరణకు గురైందని గమనించిన ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.