హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో గురువారం రాత్రి దొంగలు స్వైరవిహారం చేశారు. పట్టణంలోని ధనలక్ష్మి రోడ్డులోని రెండు దుకాణాలు, గాంధీచౌక్‌లో ఒకటి, బాలాజీ టాకీస్ రోడ్డులోని మరో దుకాణాల షట్టర్లను పగలగొట్టి రూ.లక్ష విలువైన సామాన్లను ఎత్తుకుపోయారు. శుక్రవారం ఉదయం షాపు యజమానులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలాల్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు