బనగానపల్లె : కర్నూలు జిల్లా బనగానపల్లెలో పట్టపగలే ఓదుండగుడు మహిళ నుంచి రూ. 28 వేలు దోచుకున్నాడు. విజయలక్ష్మీ అనే మహిళ బుధవారం మధ్యాహ్నం ఆంధ్రాబ్యాంకులో నగదు డ్రా చేసింది. అనంతరం ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో శివభక్తుడి వేషంలో ఉన్న ఓ దుండగుడు దాడిచేసి నగదు దోచుకుని పారిపోయాడు. విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.