మద్వానిగూడెం (కలిదిండి), న్యూస్‌లైన్ :
ఎన్నికల నిబంధనల అమలు నేపథ్యంలో కలిదిండి మండలం మద్వానిగూడెం చెక్‌పోస్టు వద్ద బుధవారం నిర్వహించిన తనిఖీల్లో రూ.2.25 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్‌లీడర్ రమణబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కలిదిండి మండలం మూలలంక గ్రామం నుంచి కొవ్వూరి సుబ్బిరెడ్డి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఒక ఫ్యాక్టరీలో డబ్బు చెల్లించేందుకు మోటారుసైకిల్‌పై బయలుదేరాడు. మద్వానిగూడెం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా రూ.2.25 లక్షల నగదు కనిపించింది.
దీనికి సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో ఈ నగదును ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు రమణబాబు తెలిపారు. తనిఖీల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి పిచ్చిబాబు, ఏఎస్సై గుమ్మడి శ్రీనివాసరావు, కా నిస్టేబుళ్లు బాలబాలాజీ, రాజేష్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
విజయవాడలో రూ.2 లక్షలు గుర్తింపు
విజయవాడ (వన్‌టౌన్) : నగరపాలకసంస్థ ఎన్నికల నేపథ్యంలో వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో బుధవారం నిర్వహించిన తనిఖీల సందర్భంగా ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై రెండు లక్షల రూపాయల నగదును తీసుకువెళుతున్నట్లు గుర్తించారు. స్థానిక విన్నకోటవారిచౌక్‌లో పోలీసులు తని ఖీలు నిర్వహిస్తుండగా అటుగా వెళ్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.
అందులో రెండు లక్షల నగదు కనిపించింది. ఆ మొత్తానికి సంబంధించి ఆయన సరైన సమాధానం చెప్పలేదు. కొద్దిసేపటి తరువాత తవుడు వ్యాపారం కోసం నగదును తీసుకెళ్తున్నానని చెప్పడంతో పోలీసులు ఆధారాలు చూపాలని సూచించారు. దీంతో సొమ్ము తీసుకెళ్తున్న వ్యక్తి ఆధారాలు చూపడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ దాడుల్లో వన్‌టౌన్ సీఐ సిహెచ్ రామారావు, ఎస్సై రామారావు తదితరులు పాల్గొన్నారు.
తనిఖీల్లో రూ.2.25 లక్షలు స్వాధీనం
Published Thu, Mar 20 2014 4:39 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement