తిరుమలలో దొంగలు రెచ్చిపోయారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు బసచేసిన జీఎంఆర్ గెస్ట్హౌస్లో అయిదు
తిరుమల : తిరుమలలో దొంగలు రెచ్చిపోయారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు బసచేసిన జీఎంఆర్ గెస్ట్హౌస్లో ఆదివారం రాత్రి అయిదు లక్షల విలువైన బంగారు నెక్లెస్ చోరీకి గురైంది. చోరీ ఘటనపై ఎమ్మెల్యే తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీవారి దర్శనం కోసం ఎమ్మెల్యే బాబూరావు కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం సాయంత్రం తిరుమలకు వచ్చారు. జీఎంఆర్ వసతి గృహంలో 7వ నెంబర్ గది తీసుకున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటల సమయంలో వరాహ స్వామి దర్శనం కోసం తాళం వేసి వెళ్లారు. రాత్రి 10.30 గంటల సమయంలో తిరిగి తమ గదికి చేరుకోగా... డైమండ్ హారం, జుమ్కీలు, ముత్యాల హారం చోరీ జరిగినట్టు గుర్తించారు. దీనిపై ఎమ్మెల్యే బాబూరావు క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.