mla baburao
-
ఎమ్మెల్యే పార్టీ: అమ్మాయిలతో పచ్చనేతల చిందులు!
-
ఎమ్మెల్యే పార్టీ: అమ్మాయిలతో పచ్చనేతల చిందులు!
సాక్షి, కనిగిరి: అసలే కొత్త సంవత్సరం.. కళ్ల ముందు అందమైన అమ్మాయిలు.. ఇంకేముంది అదో అధికారిక కార్యక్రమం అన్న విషయం కూడా మర్చిపోయారు తెలుగు తమ్ముళ్లు. స్టేజిపైన అమ్మాయిలతో చిందులేస్తూ తమను తాము మైమరిచిపోయారు పచ్చ నేతలు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో జరిగింది. కొత్త సంవత్సరం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గెస్ట్‌హౌజ్‌లో పార్టీని ఏర్పాటు చేశారు. స్పెషట్ అట్రాక్షన్ కోసం ఓ రికార్డింగ్ డాన్స్ ట్రూప్‌ను కూడా రప్పించారు. ఇంకేముంది తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే ఎదురుగానే.. అమ్మాయిలతో కలిసి చిందులేయడం ప్రారంభించారు. టీడీపీ నేతలు భేరి పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్న మస్తాన్ కూడా అమ్మాయిలతో చిందులేసిన వారిలో ఉన్నారు. బాధ్యతగల నేతలై ఉండి.. కనీస పద్ధతి పాటించకుండా వ్యవహరించిన టీడీపీ నేతల వైఖరిపై అక్కడికి వచ్చినవారంతా ముక్కున వేలేసుకున్నారు. -
ఎమ్మెల్యే బసచేసిన గదిలో నెక్లెస్ చోరీ
-
ఎమ్మెల్యే బసచేసిన గదిలో నెక్లెస్ చోరీ
తిరుమల : తిరుమలలో దొంగలు రెచ్చిపోయారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు బసచేసిన జీఎంఆర్ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం రాత్రి అయిదు లక్షల విలువైన బంగారు నెక్లెస్ చోరీకి గురైంది. చోరీ ఘటనపై ఎమ్మెల్యే తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీవారి దర్శనం కోసం ఎమ్మెల్యే బాబూరావు కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం సాయంత్రం తిరుమలకు వచ్చారు. జీఎంఆర్ వసతి గృహంలో 7వ నెంబర్ గది తీసుకున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటల సమయంలో వరాహ స్వామి దర్శనం కోసం తాళం వేసి వెళ్లారు. రాత్రి 10.30 గంటల సమయంలో తిరిగి తమ గదికి చేరుకోగా... డైమండ్ హారం, జుమ్కీలు, ముత్యాల హారం చోరీ జరిగినట్టు గుర్తించారు. దీనిపై ఎమ్మెల్యే బాబూరావు క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.