బ్యాంకు ఖాతాలో రూ.50వేలు మాయం | Rs 50 thousand displaced of The bank account | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతాలో రూ.50వేలు మాయం

Published Tue, Sep 22 2015 10:37 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50 వేలు రాత్రికి రాత్రి మాయమయ్యాయి.

బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50 వేలు రాత్రికి రాత్రి మాయమయ్యాయి. కృష్ణా జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన శ్రీదేవి స్థానిక తహశీల్దార్ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త కోనారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. స్థానిక ఆంధ్రా బ్యాంకులో శ్రీదేవి పేరిట ఖాతా ఉంది. ఆమె ఖాతాలో సోమవారం సాయంత్రం వరకు రూ.50వేలు ఉన్నాయి. అయితే, మంగళవారం ఉదయం చూసుకునేసరికి బ్యాలెన్స్ సున్నాగా కనిపించడంతో ఆమె  కంగారుపడి అధికారులను సంప్రదించారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు రూ.2 వేల చొప్పున 25 సార్లు షాపింగ్ పోర్టల్ ద్వారా డ్రాచేసినట్లు తెలిసింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement