నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రాక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు ఆరా తీస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి, ఆర్‌ఎస్‌ఎస్‌కు పార్టీకి మధ్య సమన్వయం, రాజకీయ పొత్తులు, పార్టీ పటిష్టత, కొత్త వలసలపై వాకబు చేశారు. పార్టీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించిన తర్వాత బీజేపీ పరిస్థితి ఏమిటనే దానిపై కూడా దృష్టి సారించారు.
గత ఏడాది ద్వితీయార్థంలో చేపట్టిన కార్యకలాపాలను చర్చించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కమిటీ సమావేశాలుమంగళవారం షామీర్‌పేటలో ప్రారంభమయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు మంగేష్‌జీ, శ్యామ్‌జీ, సతీష్‌జీ తదితరులు సమావేశమయ్యారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సహా మొత్తం 22మంది పదాధికారులు హాజరయ్యారు. పార్టీ అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహాన్ని, పక్కా ప్రణాళికను నేతలకు వివరించారు. కాగా, ఆరెస్సెస్ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ బుధవారం హైదరాబాద్ వస్తున్నారు.
రాష్ర్ట పరిస్థితులపై ఆరెస్సెస్ ఆరా!
Published Wed, Jan 8 2014 3:46 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement