కలెక్టరేట్ , న్యూస్‌లైన్: ఆర్టీసీ కార్మికుల సమస్యల ను పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ ఈ నెల 27 నుంచి నిర్వహించే సమ్మెకు కార్మికులు సిద్ధం కావాలని ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పవన్, టీఎంయూ రిజినల్ కార్యద ర్శి శ్రీ నివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఐబీ అతిథిగృహంలో సమ్మె సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల జీత భత్యాలు, కార్మికుల క్రమబద్ధీకరణ, మధ్యంతర భృతి డిమాండ్‌లను వెంటనే పరి ష్కరించాలని డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబర్ 20న ఆర్టీసీ యాజమాన్యానికి ఈ యూ, టీఎం యూలు సమ్మె నోటీసు ఇచ్చినా నేటికి పరిష్కారం కాలేదన్నారు. గతేడాది మా ర్చిలో వేతనాల సవరణకు సంబంధించి ప్రతి పాదనలు సమర్పించినా స్పందన కొరవడిందన్నారు. దీంతో సమ్మెకు సిద్ధమైనట్లు చెప్పారు. సమ్మెనుకు కార్మికుల మద్దతును కూడగట్టడం లో భాగంగా 25న హైదరాబాద్‌లోని ఎం జీబీ ఎస్ ఆవరణలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, టీఎం యూ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు హరీష్‌రావుతో పాటు ఆయా యూనియన్ల నాయకులు పాల్గొననున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
27 నుంచి ఆర్టీసీ సమ్మె
Published Sat, Jan 25 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement