నాలుగు నెలలు... రూ.450 కోట్లు | rtc losses to the record level | Sakshi
Sakshi News home page

నాలుగు నెలలు... రూ.450 కోట్లు

Published Sun, Sep 14 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

నాలుగు నెలలు... రూ.450 కోట్లు

ఆర్టీసీకి రికార్డుస్థాయి నష్టాలు
ఈ ఆర్థిక సంవత్సరం వేయి కోట్లు ఉంటుందని అంచనా
పరిస్థితి చేయి దాటిపోతోందంటూ ప్రభుత్వానికి అధికారుల నివేదిక
వెంటనే దిద్దుబాటు చర్యలు
చేపట్టాలని విన్నపం

 
హైదరాబాద్: రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థకు డేంజర్ హారన్ మోగుతోంది. అప్పులు, నష్టాలతో ఇప్పటివరకు ఎలాగోలా ‘నెట్టుకుంటూ’ వచ్చిన రవాణా సంస్థ ఇక చేతులెత్తేసే పరిస్థితికి చేరుకుం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెల ల్లో ఆర్టీసీ చరిత్రలో కనీవినీ ఎరుగని నష్టాలను చవిచూసింది. దీంతో దిమ్మతిరిగిన ఆర్టీసీ యాజ మాన్యం ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఉన్నఫళం గా ఆదుకోకపోతే సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని తేల్చిచెప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.902 కోట్ల నష్టానికే బిత్తరపోయిన ఆర్టీసీకి ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు (ఏ ప్రిల్-జూలై) మాసాల్లో ఏకంగా రూ.450 కోట్ల నష్టాలు కోలుకోకుండా చేశాయి. తాజాగా లెక్కలేసిన యాజమాన్యం విషయాన్ని ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి, ఈ సారి నష్టం వేయికోట్లు దాటుతుందని ముందస్తు అంచనాను సమర్పించింది.
 
పదుల నుంచి వందల్లోకి...


గత సంవత్సరం మే నెలలో ఆర్టీసీకి రూ.35 కోట్ల నష్టం మాత్రమే వాటిల్లింది. కానీ, ఈ ఏడాది మేలో ఏకంగా రూ.188 కోట్ల నష్టం వచ్చిపడింది. గత ఏడాదితో పోల్చితే ఎప్పటికప్పుడు నష్టాలు తీవ్రమవుతుండడంతో ఆర్టీసీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం కాలంగా ఉమ్మడి రాష్ర్టం లో ఉద్యమాల నేపథ్యంలో ఆర్టీసీ పరిస్థితిని ప్ర భుత్వం సమీక్షించలేకపోయింది. నష్టాలు క్రమం గా పెరుగుతున్నాయన్న విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా పట్టుతప్పింది. ముఖ్యంగా గత సంవత్సరం ఆగస్టు నుంచి నష్టాల తీవ్రత మరింత పెరిగింది. ఆ నెలలో ఏకంగా రూ.113 కోట్ల నష్టాలు రావడంతో అధికారులు బిత్తరపోయారు. ఒకేనెలలో నష్టాలు రూ.వంద కోట్లు దాటడం సాధారణ విషయం కాదు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గత డిసెంబర్‌లో రూ.65 కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ.71 కోట్లు, ఫిబ్రవరిలో రూ.58 కోట్లు, మార్చిలో రూ.195 కోట్లు... ఇలా ఆర్టీసీని నష్టాలు చుట్టుముట్టాయి. గడిచిన మూడునెలల్లో వరుసగా వంద కోట్లకు పైగానే నష్టం రావడంతో పరిస్థితి తమ చేయిదాటిపోయిందని అధికారులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అయితే, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.250 కోట్ల చొప్పున గ్రాంటు మంజూరు చేయడం మినహా దిద్దుబాటుకు ఉపక్రమించకపోవడం విశేషం.
 
పదవీ విరమణ సిబ్బందికి పైసలేవీ....    
 

ఆర్టీసీలో పెరుగుతున్న నష్టాలు బస్సుల నిర్వహణపైనే కాదు... సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలపైనా పడుతోంది. సిబ్బంది భవిష్యనిధి దాదాపు రూ.160 కోట్లు సొంతానికి వాడుకున్న ఆర్టీసీ.. తాజాగా పదవీ విరమణ సిబ్బందికి చెల్లించాల్సిన మొత్తాలను దాదాపు నిలిపివేసింది. ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన సిబ్బందికి పక్షం రోజుల్లో రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించడం ఆనవాయితీ. కానీ, నష్టాల తీవ్రత కారణంగా ఆ చెల్లింపులు నిలిపివేసింది. గత రెండు నెలల్లో 650 మంది కార్మికుల ఫైళ్లు పెండింగ్‌లోకి వెళ్లాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే గాని వీరికి చెల్లింపులు జరిపే పరిస్థితి లేదు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement