ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక నేతల చర్చలు | rtc management invite workers for discussion | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక నేతల చర్చలు

Published Fri, May 8 2015 5:06 PM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

rtc management invite workers for discussion

హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు ఆహ్వానించింది. కాసేపట్లో బస్ భవన్ లో కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరపనుంది. తమ డిమాండ్ల సాధన కోసం మూడు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కాగా ఆర్టీసీ కార్మికులు చర్చలకు వస్తే ఆహ్వానిస్తామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ప్రకటించారు.

కాగా, ఆర్టీసీ కార్మికుల అణచివేతకు నిరసనగా ఆర్టీసీ బోర్డు పదవికి ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) నేత పద్మాకర్ రాజీనామా చేశారు. ఆర్టీసీ ఎండీ మొండి వైఖరి విడనాడాలని, సానుకూల వాతావరణంలో చర్చలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement