ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు మరోసారి విఫలం | tc workers discussion with md not succeed | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు మరోసారి విఫలం

Published Fri, May 8 2015 6:19 PM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు మరోసారి విఫలం

ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు మరోసారి విఫలం

హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను ఆర్టీసీ యాజమాన్యం మరోసారి చర్చలకు ఆహ్వానించినా.. ఆ చర్చలు ఫలించలేదు. బస్ భవన్ లో కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపింది.  తొలుత ఆర్టీసీ కార్మికులు చర్చలకు వస్తే ఆహ్వానిస్తామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ప్రకటించడంతో కార్మికులు చర్చలకు వచ్చారు. అయితే కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం వెనక్కి తగ్గకపోవడంతో చర్చలు విఫలం కాక తప్పలేదు.  43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు. మళ్లీ చర్చలకు పిలిచినా.. అందుకు వచ్చే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి.

 

ఈ నేపథ్యంలో చర్చలు మరో కొద్ది రోజులు జరిగే అవకాశం ఉంది. గత మూడు రోజుల నుంచి కార్మికులు సమ్మె హారన్ మోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ప్రైవేటు వాహన దారులు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement